హోమ్ / వంటకాలు / టోఫు - స్పినాచ్ బాల్స్

Photo of Tofu -Spinach Balls by Abhinetri V at BetterButter
558
0
0.0(0)
0

టోఫు - స్పినాచ్ బాల్స్

Oct-20-2018
Abhinetri V
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టోఫు - స్పినాచ్ బాల్స్ రెసిపీ గురించి

టోఫు మరియు పాలకూర ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి మన ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రియెంట్స్ ను పుష్కలంగా అందిస్తాయి. ఈ రెండిటి కలయికతో ఒక హెల్తీ స్నాక్ తయారుచేసుకుంటే టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చు. వీటిని ఎలా తయారుచెయ్యలో ఇప్పుడు చూదాం..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. టోఫు,తురిమిన - 2 కప్పులు
  2. పాలకూర,తరిగిన- 2 కప్పులు
  3. ఉల్లి ,సన్నగా తరిగిన - 1 కప్పు
  4. ఉప్పు- రుచికి సరిపడ
  5. పచ్చిమిర్చి ముక్కలు- 2 టీస్పూన్స్
  6. అల్లం ముక్కలు,సన్నగా తరిగిన-1 టీస్పూన్
  7. బొంబాయి రవ్వ/సూజి - 2 టేబుల్ స్పూన్స్
  8. మొక్కజొన్న ఫ్లేక్స్ తో తయారైన పొడి- 1 కప్పు
  9. నూనె- వేయించడానికి సరిపడ

సూచనలు

  1. ఒక గిన్నె లో తురిమిన టోఫు, పాలకూర తరుగు, ఉల్లి ముక్కలు , అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు మరియు బొంబాయి రవ్వ వేసి శుభ్రంగా కలిపి ఒక ముద్ద/డో లాగా తయారు చేసుకోవాలి.
  2. ఈ ముద్ద లో నుండి చిన్న సైజ్ ఉండలు/బాల్స్ తయారు చేయాలి.
  3. ఇంతలోపు ఒక బాణానిలో నూనె ని పోసి సన్నని సెగపైన మరగనివ్వాలి.
  4. నూనె మరిగాక, ముందుగా తయ్యార్ చేసి పెట్టుకున్న చిన్న సైజ్ ఉండలని మొక్కజొన్న పొడి లో జాగ్రత్తగా దొర్లించి/రోల్ చేసి కాగే నూనె లో వేసి రెండు వైవుల వేయించాలి.
  5. బంగారపు వర్ణంలోకి వచ్చిన తరువాత, వీటిని ప్లేట్ లో వేసి సర్వ్ చెయ్యండి.
  6. టోఫు-స్పీనాచ్ బాల్స్ సాస్ తో లేదా చట్నీ తో రుచికరంగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర