బచ్చలి కూర పప్పు | Malabar spinach dal Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Malabar spinach dal by Sree Vaishnavi at BetterButter
బచ్చలి కూర పప్పుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

బచ్చలి కూర పప్పు వంటకం

బచ్చలి కూర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Malabar spinach dal Recipe in Telugu )

  • బచ్చలి ఆకులు 1 కట్ట
  • కంది పప్పు 1 కప్
  • పచ్చిమిరపకాయలు 3
  • నూనె 3-4 చెంచాలు
  • నీళ్లు తగినంత
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • ఎండుమిర్చి 2-3
  • ఇంగువ చిటికెడు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ

బచ్చలి కూర పప్పు | How to make Malabar spinach dal Recipe in Telugu

  1. ముందుగా బచ్చలి కూర ని శుభ్రంగా కడిగి తరుగుకోవాలి
  2. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు తరిగిన బచ్చలికూర, ఉప్పు ,పసుపు ,నీళ్లు పోసి 3-4 విస్టల్స్ వచ్చే వరకు ఉంచాలి
  3. ఇప్పుడు అది ఉడికిన తరువాత దానిని బాగా కలిపి తగినంత కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  5. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ ,కరివేపాకు వేసి వేయించాలి
  6. వేగిన తరువాత దానిని పప్పు లో వేసి సర్వ్ చేయడమే

Reviews for Malabar spinach dal Recipe in Telugu (0)