హోమ్ / వంటకాలు / పుదీనా పులావ్

Photo of Mint Pulav by Pravallika Srinivas at BetterButter
219
1
0.0(0)
0

పుదీనా పులావ్

Oct-22-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా పులావ్ రెసిపీ గురించి

పోషకాలు పుష్కలంగా ఉన్న పుదిన ఆకు క్రిములను నాశనం చేస్తుంది. మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది. పుదినా ఆకును నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు.. చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది.ఇలాంటి పుదీనా ని పేస్ట్ లాగ చేసి పులావ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దమా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. పుదీనా - 1 కప్పు
  2. బాస్మతీ బియ్యం - 3 కప్పులు
  3. క్యారెట్ - 1
  4. ఆలు - 2
  5. పచ్చిమిర్చి -6
  6. వెల్లులిరెబ్బలు - 5
  7. అల్లం - 1 అంగుళం ముక్క
  8. కొత్తిమీర - 1/4 కప్పు
  9. నెయ్యి - 2 చెంచాలు
  10. నూనె - 3 చెంచాలు
  11. హోల్ గరం మసాలా - తగినంత
  12. షాజీరా - 1 స్పూన్
  13. పచ్చిబఠాణీలు - 1/4 కప్
  14. నీరు - 4.5 కప్పులు
  15. ఉప్పు - తగినంత

సూచనలు

  1. ముందుగా పుదీనా వలిచి కడిగి పెట్టుకోవాలి. బాస్మతీ బియ్యం నానపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు క్యారెట్ ఆలు కొంచం పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  3. ఒక మిక్సర్ జార్ లో పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లులిరెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  4. మందంగా ఉన్న గిన్నె పెట్టి నెయ్యి నూనె వేసి కాగాక హోల్ గరం మసాలా షాజీరా వేసి వేగాక తరిగిన కూరగాయ ముక్కలు వేస్కుని మగ్గనివ్వాలి.
  5. ఇప్పుడు పచ్చిబఠాణీలు నీరు ఉప్పు వేసి నీటిని తెరలనిచ్చి నానబెట్టిన బియ్యం వేసుకోవాలి.
  6. ఒకసారి అన్ని కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి.
  7. కొంచం ఉడికిన తర్వాత మూత పెట్టి సన్న మంటపైన నీరు లేకుండా ఉడికించుకోవాలి.
  8. అంతే రుచికరమైన పుదీనా పులావ్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర