హోమ్ / వంటకాలు / కరివేపాకు పొడి

Photo of Curryleaves spice powder by Anitha Rani at BetterButter
314
9
0(0)
0

కరివేపాకు పొడి

Oct-23-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పొడి రెసిపీ గురించి

కరివేపాకు అనారోగ్యానికి చాలా మంచిది అని తెలుసు.కానీ కూరలలో తీసి పక్కన పెడుతుంటారు. ఇలా పొడి అయితే తెలియకనే తింటారు.ఈ పొడి ఇడ్లి,దోస,అన్నము,పులిహోర కు వాడు కోవచ్చు.అన్నము లో మొదటి ముద్ద పొడి,నెయ్యితో కలిపితింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 8

  1. పచ్చి కరివేపాకు...1కప్పు
  2. ఎందుమిరపకాయలు...6
  3. మినపప్పు....2 స్పూన్స్
  4. శనగపప్పు...2స్పూన్స్
  5. నువ్వులు...2స్పూన్స్
  6. పల్లీలు..2స్పూన్స్
  7. ఉప్పు...తగినంత
  8. నూనె...2స్పూన్స్

సూచనలు

  1. కరివేపాకు ఓలుచుకొని నీటీతో బాగా కడగాలి.
  2. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి కాగిన తరువాత వరుసగా శనగ పప్పు,మినపప్పు,పల్లిలు,ఎందుమిరపకాయలు,నువ్వులు,కొద్దిగా ఇంగువ చివరగా కరివేపాకు కు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
  3. చల్లారగానే ఉప్పు వేసి అన్ని కలిపి మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి.
  4. ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి తయారు.
  5. తడి తగలకుండా ఉంటే 4 నెలల వరకు ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర