హోమ్ / వంటకాలు / గోంగూర దాల్ ప్రై

Photo of Red sorrel leaves dal fry by Kavitha Perumareddy at BetterButter
619
1
0.0(0)
0

గోంగూర దాల్ ప్రై

Oct-24-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర దాల్ ప్రై రెసిపీ గురించి

ఇలా చేస్తే గోంగూర పప్పు చాలా రుచిగా ఉంటుంది .అన్నంలో, పుల్కా ,రోటీ,చెపాతి దేనిలోకి ఐనా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోంగూర రెండు కట్టలు
  2. కందిపప్పు ఒక చిన్న కప్
  3. ఉల్లిపాయలు 2
  4. పచ్చిమిర్చి 3
  5. కారం స్పున్
  6. ఉప్పు తగినంత
  7. పసుపు కొద్దిగా
  8. పోపుగింజెలు స్పున్
  9. నూనె 2 స్పూన్స్
  10. వెల్లుల్లి 4 రెబ్బలు
  11. ఎండుమిర్చి 2 పోపుకు
  12. కరివేపాకు కొద్దిగా
  13. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా గోంగూర ఒలిచి శుభ్రంగా ఉప్పునీటి లో వేసికడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి .
  2. ఇప్పుడు కంది పప్పును కడిగి ఒక కప్ కు మూడు కప్స్ నీళ్లు పోసి ,పసుపు కొద్దిగా వేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి ...
  3. తరువాత పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి పోపుగింజెలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని పోవును వేగనిచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి కాసేపు మగ్గించుకోవాలి. తరువాత గోంగూర వేసి మూత పెట్టి 5 నిముషాలు చిన్న మంట మీద మగ్గించుకోవాలి.
  4. తరువాత గోంగూర మిశ్రమంలో కొద్దిగా పసుపు,కారం వేసి కలపాలి .కొత్తిమీర కూడా వేసుకోవాలి .తరువాత ఉడికించుకున్న కందిపప్పు వేసి అంతా కలిపి కాసేపు ఉండి స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే గోంగూర పప్పు ఫ్రై రెడీ ...ఇక వేరే గిన్నెలో తీసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర తో అలంకరించుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర