పాలకూర పప్పు | spinach dal Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  24th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of spinach dal  by Anitha Rani at BetterButter
పాలకూర పప్పుby Anitha Rani
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

పాలకూర పప్పు

పాలకూర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make spinach dal Recipe in Telugu )

  • కందిపప్పు...100 గ్రా
  • పచ్చిమిరప కాయలు...8
  • పాలకూర.....1కట్ట
  • టమోటాలు...2
  • చింతపండు...కొద్దిగా
  • ఉల్లిపాయ...1
  • వెల్లుల్లిరెబ్బలు....6
  • పసుపు...1స్పూన్
  • జీలకర్ర....1స్పూన్
  • ఉప్పు..తగినంత
  • నూనె...2స్పూన్స్
  • కరివేపాకు..4 రెబ్బలు
  • ఎందుమిరపకాయలు..2
  • ఆవాలు...1స్పూ
  • ధనియాలు...1స్పూన్
  • ఇంగువ...చిటికెడు
  • కొత్తిమీర,కరివేపాకు... పోపు కు

పాలకూర పప్పు | How to make spinach dal Recipe in Telugu

  1. మొదట పాలకూర ను ఉప్పు నీటి లో బాగా కడగాలి.
  2. కుక్కర్ లో కడిగిన కందిపప్పు,పాలకూర ఆకు,పచ్చిమిర్చి,టమోటో పసుపు,చింతపండు పైన ప్లేట్ లో పెట్టిన కొలతలతో కుక్కర్ లో వీసి 1కి 2 నీళ్లు పూసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పట్టాలి.
  3. కుక్కర్ 3 విసిల్స్ వచ్చేవరకు ఉంచి ఆఫ్ చెయ్యాలి
  4. చల్లారిన తరువాత కుక్కర్ మూత తీసి పప్పు ఉడికినది లేనిది చూసుకోవాలి.
  5. ఉప్పు వేసి మెత్తగా పప్పు గుతి తో కానీ,లేదా గారిట తో కానీ మెత్తగా చేసుకోవాలి.
  6. స్టవ్ పైన బాండీ పెట్టి వీడి అయ్యాక ఆవాలు,జీలకర్ర,ఉల్లిపాయముక్కలు,ధనియాలు,జీలకర్ర,ఎందుమిరపకాయ,కరివేపాకు,ఇంగువ వేసి వేగాక పప్పు ను బాండీ లో వీసి 4 ని ఉడికించాలి.
  7. చివరగా కోతిమీరను వేసి కలుపు కోవాలి.
  8. రుచి కరమైన పాలకూర పప్పు తయారు

నా చిట్కా:

పాల కూర పప్పు లో పసుపు కొద్దిగా ఎక్కువ వేయడము వలన పప్పు ఆకుపచ్చగా ఉండదు...పసుపు పచ్చగా ఉంటుంది..పిల్లలు ఇష్టముగా తింటారు

Reviews for spinach dal Recipe in Telugu (0)