హోమ్ / వంటకాలు / కొత్తిమీర పెసరపప్పు పెరుగు పకోడీ

Photo of Coriander greenmoong curd pakoda by Pravallika Srinivas at BetterButter
342
2
0.0(0)
0

కొత్తిమీర పెసరపప్పు పెరుగు పకోడీ

Oct-24-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పెసరపప్పు పెరుగు పకోడీ రెసిపీ గురించి

పెసరపప్పు తో పకోడీ చేసి పెరుగులో నానపెట్టి చేసేది.ఎక్కువగా పండగలకి ఫంక్షన్స్ కి పెరుగు వడ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎప్పుడు అలానే కాకుండా కొంచం కొత్తగా కొత్తిమీర ఫ్లైవర్ బాగా తెలుస్తుంది ఈ దాహి పకోడిలో . ఎలా చేయాలో చూసేద్దామా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిలకడం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. కొత్తిమీర - 1 కట్ట
  2. పెసరపప్పు - 1 కప్పు
  3. పచ్చిశనగపప్పు - 2 టేబుల్ స్పూన్
  4. ఉప్పు - తగినంత
  5. అల్లం - 1 అంగుళం ముక్క
  6. పచ్చిమిర్చి - 4
  7. కర్వేపాకు - 2 రెమ్మలు
  8. జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్
  9. పెరుగు - 1 కప్పు
  10. నూనె - 1 టేబుల్ స్పూన్
  11. పోపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
  12. ఎండుమిర్చి - 2

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు, పచ్చిశనగపప్పు ఒక 2 గంటలు నానపెట్టి ఒక మిక్సర్ జార్లో వేసి ఉప్పు పచ్చిమిర్చి అల్లం వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  2. తయారైన మిశ్రమాన్ని ఉండలుగా చేసి డీపీఫ్రై చేసుకోవాలి.
  3. ఇప్పుడు మిక్సర్ జార్ లో కొత్తిమీర, జీలకర్ర ,కర్వేపాకు, పచ్చిమిర్చి ,ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  4. పెరుగు ని చిలకొట్టుకోవాలి.కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు కర్వేపాకు యండుమిర్చి వేసి వేగాక కొత్తిమీర పేస్ట్ వేసి కలుపుకోవాలి.
  5. ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని పెరుగులో కలుపుకోవాలి. ఫ్రై అయినా పకోడీ బాల్స్ ని వేడిగా ఉన్నపుడే పెరుగు లో వేసి కలుపుకుని ఒక గంట సమయం నాననివ్వాలి.
  6. అంతే రుచికరమైన కొత్తిమీర పెసరపప్పు పెరుగు పకోడీ రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర