హోమ్ / వంటకాలు / తోటకూర ఆవ పులుసు

Photo of amaranthus mustard  stew  by రమ్య వూటుకూరి at BetterButter
791
1
0.0(0)
0

తోటకూర ఆవ పులుసు

Oct-25-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
13 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర ఆవ పులుసు రెసిపీ గురించి

ఇది మా అమ్మమ్మ గారు చేసేవారు. చాలా పాత వంటకమే కానీ చాలా మందికి తెలియదు అనుకొంటున్నాను. నువ్వులు తోటకూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నం లోకి ఉల్లిపాయ కాంబినేషన్ తో బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తోటకూర 2 కట్టలు
  2. నువ్వులు 4 స్పూన్స్
  3. బియ్యం 1/4 స్పూన్
  4. ఆవాలు 1/4 స్పూన్
  5. పచ్చిమిర్చి 3
  6. ఉప్పు తగినంత
  7. ఆయిల్ 1 టీస్పూన్
  8. ఎండుమిర్చి 2
  9. పోపుగింజలు 2 స్పూన్స్
  10. వెల్లుల్లి రెబ్బలు 5
  11. ఇంగువ చిటికెడు
  12. చింతపండు నిమ్మకాయంత
  13. పసుపు చిటికెడు

సూచనలు

  1. తోటకూర కడిగి ముక్కలు చేసుకొని వాటర్ పోసి ఉడికించాలి
  2. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  3. చింతపండు నానబెట్టి పులుసు తీస్కొని పెట్టుకోవాలి
  4. ఆవాలు నువ్వులు పచ్చిమిర్చి బియ్యం చిటికెడు ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోని ఉంచుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి వేడెక్కాక ఆయిల్ పోపు గింజలు ఎండుమిర్చి వేసి పోపు వేసుకోవాలి
  6. పోపులో ఇంగువ దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి
  7. తర్వాత గ్రైండ్ చేసుకొన్న తోటకూర వేసి 2 మినిట్స్ వేయించాలి
  8. వేగిన తర్వాత పసుపు ఉప్పు చింతపండు రసం తోటకూర ఉడికించిన వాటర్ పోసి ఉడికించాలి
  9. బాగా ఉడికాక తయారు చేసుకొన్న ఆవ పేస్ట్ వేసి 2 మినిట్స్ ఉడికించాలి
  10. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర