హోమ్ / వంటకాలు / చీజీ పాలక్ కార్న్ పాస్తా

Photo of Cheesy spinach corn pasta by Sree Sadhu at BetterButter
594
1
0.0(0)
0

చీజీ పాలక్ కార్న్ పాస్తా

Oct-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజీ పాలక్ కార్న్ పాస్తా రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. పెన్నె పాస్తా 1 కప్
  2. కార్న్ 1/2 కప్
  3. పాలక్ 1/2 కప్
  4. పాలు 1 కప్
  5. వెల్లులి రెబ్బలు 2-3
  6. బట్టర్ 2 చెంచాలు
  7. బేసిల్ 1/2 చెంచా
  8. మిశ్రమ మూలికల పొడి 1 చెంచా
  9. మైదా 1 -2 చెంచాలు
  10. ఛీజ్ 1/8 కప్

సూచనలు

  1. ముందుగా ఒక బాండి లో బట్టర్ వేసుకుని కరిగించుకోవాలి
  2. కరిగిన తరువాత అందులో తరిగిన వెల్లులి వేసుకోవాలి
  3. వెల్లులి వేగాక అందులో మైదా వేసుకోవాలి
  4. మైదా పిండి వేసుకుని బాగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు
  5. కొంచెం గోధుమ రంగు రానివ్వాలి
  6. ఈలోపు పాస్తా నీ ఉడికించి వరుచుకోవాలి
  7. కార్న్ కూడా ఉడికించి వలుచుకోవాలి
  8. పాలకురాని ఉడికించి పేస్ట్ చేయాలి
  9. ఇప్పుడు ఆ వేగిన మైదా పిండిలో పాలు పోసుకుని కలుపుకోవాలి
  10. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  11. అందులో రెడ్ చిల్లి ఫ్లక్స్ కూడా వేసుకోవాలి
  12. బాగా కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలి
  13. అందులో ఉడికంచి పేస్ట్ చేసిన పాలకూర వేసుకోవాలి
  14. అందులో పెద్ద రెండునుంచి మూడు చెంచాలు వేసుకోవాలి
  15. బాగా కలుపుకోవాలి
  16. అందులో మిశ్రమ మూలికల పొడి వేసుకోవాలి
  17. ఒక చెంచా వేసుకోవాలి
  18. అందులో బేసిల్ కూడా వేసుకోవాలి
  19. అన్నిటిని బాగా కలిపాక అందులో స్వీట్ కార్న్ వేసుకోవాలి
  20. దానిని బాగా కలిపి ఓక రెండు నిమిషాలు ఉడికించాలి
  21. అందులో ఛీజ్ వేసుకోవాలి
  22. ఛీజ్ కరిగాక అందులో ఉడికించిన పాస్తా వేసుకోవాలి
  23. బాగా కలిసేలా కలుపుకోవాలి
  24. ఇప్పుడు మళ్ళి ఛీజ్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి
  25. అంతే ఆ పాస్తా నీ సెర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర