హోమ్ / వంటకాలు / పాలక్ చల్ల చెకోడీలు

Photo of SPINACH CHEKODILU by రమ్య వూటుకూరి at BetterButter
895
0
0.0(0)
0

పాలక్ చల్ల చెకోడీలు

Oct-26-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ చల్ల చెకోడీలు రెసిపీ గురించి

ఇది టీ టైం స్నాక్ . పిల్లలు పెద్దలు అందరికి నచ్చుతుంది. దీనిలో పుల్లని మజ్జిగ వాడటం వల్ల మంచి రుచితో తినడానికి బాగుంటాయి. పాలకూర వేయడం వల్ల హీల్తీ అండ్ కలర్ ఫుల్ గా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర 2 కట్టలు
  2. బియ్యం పిండి 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. పెసరపప్పు 3 స్పూన్స్
  5. పుల్లని మజ్జిగ 1 కప్
  6. ఇంగువ 1/4 స్పూన్
  7. పచ్చిమిర్చి 4
  8. కొత్తిమీర కొంచం
  9. కరివేపాకు కొంచం
  10. జీలకర్ర 1/2 స్పూన్
  11. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. పాలకూర ఉడికించి పేస్ట్ తయారు చేసుకోవాలి
  2. పెసరపప్పు 10 మినిట్స్ నానబెచుకోవాలి
  3. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి
  4. గిన్నెలో మజ్జిగ ఇంగువ ఉప్పు సన్నగా తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి బాగా మరిగించాలి
  5. ఇప్పుడు పాలకూర పేస్ట్ పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి
  6. మజ్జిగ బాగా మరుగుతున్నప్పుడు బియ్యం పిండి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. ఈ మిశ్రమాన్ని ప్లేట్ లోకి తీస్కొని బాగా చల్లారాక చెకోడీలు చేసుకోవాలి
  8. కాగుతున్న నూనె లోవేసి బాగా వేపుకొంటే పాలక్ చల్ల చేకొడిలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర