హోమ్ / వంటకాలు / చుక్కకూర పప్పు ( మద్రాసు కందిపప్పుతో)

Photo of Sorrel Dal ( with red toor dal) by Pravallika Srinivas at BetterButter
595
1
0.0(0)
0

చుక్కకూర పప్పు ( మద్రాసు కందిపప్పుతో)

Oct-27-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చుక్కకూర పప్పు ( మద్రాసు కందిపప్పుతో) రెసిపీ గురించి

చుక్కకూర పుల్లగా రుచిగా ఉంటుంది .దీనోతో పులుసు పప్పు బాగుంటుంది.చుక్కకూర చాలా త్వరగా ఉడికిపోతుంది. మాములు కందిపప్పు ఉడకడానికి కొంచం సమయం తీసుకుంటుంది కానీ ఎర్ర కందిపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది .చుక్కకూర పప్పు మద్రాసు కందిపప్పుతో చూసేద్దామా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. చుక్కకూర - 1 కప్పు
  2. ఎర్రకందిపప్పు - 1 కప్పు
  3. టమాటో - 1
  4. ఉల్లిపాయ - 1
  5. పచ్చిమిర్చి - 3
  6. ఉప్పు - 1 స్పూన్
  7. కారం - 1 స్పూన్
  8. నూనె - 2 స్పూన్లు
  9. పోపు దినుసులు - 1 స్పూన్
  10. యండుమిర్చి- 2
  11. పసుపు - 1/4 స్పూన్
  12. ఇంగువ - 1/4 స్పూన్
  13. వెల్లులిరెబ్బలు - 7
  14. కొత్తిమీర - 4 రెమ్మలు
  15. కర్వేపాకు - 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా చుక్కకూర కడిగి తరిగి పెట్టుకోవాలి.కందిపప్పు కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక తపాలా లో కందిపప్పు, నీరు వేసి ఉడికించుకోవాలి.
  3. కొంచం ఉడికిన తర్వాత చుక్కకూర, ఉల్లితరుగు ,టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి.
  4. చివరిగా ఉప్పు ,కారం వేసి కలుపుకోవాలి.
  5. ఒక కడై పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, యండుమిర్చి ,పసుపు, ఇంగువ, వెల్లులిరెబ్బలు ,కర్వేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
  6. అంతే రుచికరమైన చుక్కకూర పప్పు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర