హోమ్ / వంటకాలు / మునగాకు బంగాళదుంప వేపుడు

Photo of Drumstick leaves, potato stir fry by Kavitha Perumareddy at BetterButter
819
1
0.0(0)
0

మునగాకు బంగాళదుంప వేపుడు

Oct-27-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు బంగాళదుంప వేపుడు రెసిపీ గురించి

ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చేయడం కూడా సులభం .ఇలా చేస్తే పిల్లల చేత కూడా మునగాకు తింపించవచ్చు.అప్పుడు దానిలోని పోషకాలు అందుతాయి.ఇది చెపాతి, రొట్టెలు లో చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మునగాకు కప్
  2. బంగాళదుంపలు పావుకిలో
  3. పచ్చిమిర్చి 3
  4. ఉల్లిపాయలు 2
  5. టమాటాలు 2
  6. నూనె 2 స్పూన్స్
  7. పోపుగింజెలు స్పున్
  8. పసుపు కొద్దిగా
  9. కారం సగం స్పున్
  10. ధనియాలపొడి స్పున్
  11. ఉప్పు తగినంత
  12. వెల్లుల్లి 10 రెబ్బలు
  13. కరివేపాకు కొద్దిగా
  14. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా మునగాకు కడిగి పెట్టుకోవాలి .లేతగా ఉండే ఆకు ఐతే బాగుంటుంది. బంగాళదుంప ఉడికించుకోవాలి. టమాటా,పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి పోపుగింజెలు వేసి వేగినతరువత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ,చితక్కొట్టిన వెల్లుల్లి అన్ని ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించుకోవాలి .తరువాత పసుపు వేసి కలపాలి .మునగాకు వేసి కలిపి 5 నిముసాలు బాగా వేయించుకోవాలి .
  3. మునగాకు బాగా మగ్గినతరువాత టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి.
  4. టమాటా బాగా మెత్తగా మగ్గినతారువాత కారం,ధనియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి .తరువాత బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి .
  5. మరీ ఎక్కువగా కలపకూడదు బంగాళదుంప చిదిగిపోతాయి.కాసేపు ఉండి స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలో తీసుకొని కొత్తిమీరతో అలంకరించుకోవాలి .అంతే మునగాకు బంగాళదుంప వేపుడు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర