హోమ్ / వంటకాలు / కొత్తిమీర సగ్గుబియ్యం బాల్స్

Photo of coriander sago balls  by Kavitha Perumareddy at BetterButter
561
0
0.0(0)
0

కొత్తిమీర సగ్గుబియ్యం బాల్స్

Oct-27-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర సగ్గుబియ్యం బాల్స్ రెసిపీ గురించి

ఈ వంట చేసుకోవడం చాలా సులువు .ఈ వంటకం డీప్ ఫ్రై చేయకుండా పొంగణాల పెనం మీద చేసాను .అందువల్ల నూనె ఎక్కువ అవసరం ఉండదు .నూనె ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు .అందుకని ఇలా చేసుకుంటే ఎక్కువ నూనె పట్టదు .రుచి కూడా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సగ్గుబియ్యం ఒక కప్
  2. కొత్తిమీర ఒక కప్
  3. బంగాళదుంప 2 పెద్దవి
  4. పల్లిలపొడి 3 పెద్ద స్పూన్స్
  5. పచ్చిమిర్చి 3
  6. అల్లం ముక్కలు స్పున్
  7. ఉప్పు తగినంత
  8. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యం 3 గంటలు నానబెట్టుకోవాలి. తరువాత నీరు లేకుండా వడకట్టుకోవాలి. బంగాళదుంప ఉడికించి మెత్తగా చేసుకోవాలి.కొత్తిమీర కడిగి సన్నగా తరగాలి.అల్లం, పచ్చిమిర్చి కూడా సన్నగా తరగాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె లో సగ్గుబియ్యం,కొత్తిమీర, బంగాళదుంప, పల్లిలపొడి,అల్లం ముక్కలు,నిమ్మకాయరసం,పచ్చిమిర్చి ముక్కలు,తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి . పల్లిలపొడి నలిగి నలగకుండా ఉండాలి .అప్పుడే పప్పులు పప్పులు గా నవులుతుంటే బాగుంటుంది.
  3. అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి .నీరు అస్సలు వేయకూడదు.ముద్దలా కలుపుకోవాలి.గట్టిగా ఉండాలి.
  4. తరువాత ఈ మిశ్రమాన్ని సమాన ఉండలుగా చుట్టుకోవాలి .
  5. తరువాత పోయిమీద పొంగణాల పెనం పెట్టి వేడి ఐన తరువాత ఒక స్పూన్ నూనె అన్ని గుంతలల్లో వేసుకొని ఈ బాల్స్ అందులో పెట్టి మూత పెట్టి చిన్న మంట మీద కాలనివ్వాలి.అప్పుడే లోపల పచ్చిగా లేకుండా బాగా కాలుతాయి .
  6. అన్ని వైపులా నిదానంగా తిప్పుతూ సమానంగా కాలనివ్వాలి.గోల్డ్ కలర్ వచ్చేవరకు ఉంచి తీసేయాలి .అంతే కొత్తిమీర సగ్గుబియ్యం బాల్స్ రెడీ .పైన కరకరలాడుతూ లోపల స్మూత్ గా టమాటా సాస్ లో తింటూ ఉంటే చాలా బాగుంటాయి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర