హోమ్ / వంటకాలు / తోటకూర దాల్ ఫ్రై

Photo of Amaranthus leaves dal fry by Anitha Rani at BetterButter
457
2
0.0(0)
0

తోటకూర దాల్ ఫ్రై

Oct-28-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర దాల్ ఫ్రై రెసిపీ గురించి

తోట కూర దాల్ ఫ్రై ప్రతి రోజు అన్నము,చపాతీ,పుల్కా లలో తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర...1 కట్ట
  2. కందిపప్పు.....100గ్రా..1గ్లాస్
  3. పచ్చి మిర్చి...6
  4. టమోటా....2
  5. చింతపండు...కొద్దిగా
  6. ఉప్పు...తగినంత
  7. నూనె...2స్పూన్స్
  8. ఆవాలు,జీలకర్ర, ధనియాలు....1స్పూన్
  9. వెల్లుల్లిరెబ్బలు....6
  10. కరివేపాకు...కొద్దిగా

సూచనలు

  1. తోటకూర ను ఉప్పు వేసి రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి.
  2. కందిపప్పు కడిగి పెట్టుకోవాలి.
  3. స్టవ్ వెలిగించి కుక్కర్ వేడి అయ్యాక అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు,జీలకర్ర,ధనియాలు,మెంతులు,ఎందుమిరపకాయ,కరివేపాకు వేసి వేగ నివ్వాలి.
  4. పోపు వేగాక అందులో పచ్చి మిర్చి ముక్కలు,టమోటా ముక్కలు,వేగాక అందులో తోటకూర వేసి చిన్నమంట పైన మగ్గనివ్వాలి, తరువాత కందిపప్పు, పసుపు,చింతపండు వేసి బాగా కలపాలి.
  5. కుక్కర్లో 2 గ్లాస్సెస్ నీళ్లు పోసి, పసుపు వేసి మూత పెట్టాలి.3 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చెయ్యాలి.
  6. చల్లారిన తరువాతనే కుక్కర్ మూత తీసి అందులో ఉప్పు వేసి పప్పు గుత్తి తో కానీ గరిట తో కానీ మెత్తగా చేసుకోవాలి.
  7. వేరే గిన్నె లోకి పప్పును తీసుకొని కొత్తిమీర పైన వేసుకోవాలి.
  8. రుచికరమైన తోటకూర దాల్ ఫ్రై తయారు.వేడి అన్నము లో నెయ్యి,ఆవకాయ,పప్పు కలుపుకొని తింటే రుచి చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర