హోమ్ / వంటకాలు / హరియాలి చికెన్ ఫ్రై

Photo of Hariyali chicken fry by Chandrika Marripudi at BetterButter
621
1
0.0(0)
0

హరియాలి చికెన్ ఫ్రై

Oct-28-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హరియాలి చికెన్ ఫ్రై రెసిపీ గురించి

హరియాలి చికెన్ ఫ్రై.చికెన్ తో ఆకుకూరలు కలిపి చేసిన వేపుడు. ఇందులో నేను పాలకూర, పుదీనా, కొత్తిమీర వాడాను.ఆకుకూరలు తినడం ఇష్టపడనివాళ్ళకి అపుడపుడు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ : 1/4 కేజి
  2. పాలకూర : 1కప్
  3. పుదీన : 1కప్
  4. కొత్తిమీర : 1కప్
  5. ఉప్పు : తగినంత
  6. కారం : 2 స్పూన్లు
  7. పసుపు : 1/2 స్పూను
  8. అల్లంవెల్లుల్లి పేస్టు : 2 స్పూన్లు
  9. ధనియాలపొడి : 1 స్పూను
  10. గరంమసాలాపొడి : 1 స్పూను
  11. ఎండుకొబ్బరి పొడి : 2 స్పూన్లు
  12. నూనె : 4 స్పూన్లు
  13. కరివేపాకు : కొద్దిగా
  14. ఉల్లిపాయలు : 2
  15. పచ్చిమిర్చి : 3

సూచనలు

  1. చికెన్ కడిగి ఒక గిన్నెలో వేసి ఉప్పు,కారం,పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. పాలకూర కడిగి తరిగి కొద్దిగా నీళ్ళల్లో 2 నిమిషాలు ఉడికించి చల్లారాక మిక్సిలో పేస్ట్ చేసుకోవాలి.
  3. పుదీనా వలిచి,కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి.
  4. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి.
  5. స్టవ్ పైన బాండీలో నూనె వేసి వేడయ్యాక కరివేపాకు వేసి వేగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
  6. పుదీన, కొత్తిమీర సగం వేసి కలిపి వేగనివ్వాలి
  7. ఇపుడు పాలకూర పేస్ట్ వేసి కలపాలి
  8. తరువాత కలిపి పెట్టిన చికెన్ వేసి కలిపి మూత పెట్టకుండా ఉడికించాలి
  9. చికెన్ లో నుండి వచ్చిన నీరు ఇగిరి పోయి డ్రైగా అయేవరకు మగ్గించుకోవాలి.
  10. ఇపుడు ధనియాలపొడి, గరం మసాలా పొడి,ఎండుకొబ్బరి పొడి,వెల్లుల్లికారం వేసి కలపాలి.
  11. అంతా ఒకసారి బాగా కలిపి మిగిలిన కొత్తిమీర కూడా వేసి కలిపితే హరియాలి చికెన్ ఫ్రై రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర