హోమ్ / వంటకాలు / మునగాకు సాంబార్

Photo of Moringa Sambar by Pravallika Srinivas at BetterButter
64
1
0.0(0)
0

మునగాకు సాంబార్

Oct-28-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు సాంబార్ రెసిపీ గురించి

మునగాకు పప్పు చారు చాలా రుచికరమైన వంట.మునగాకు కొంచం మదప వాసనా ఉన్న ఇలా సాంబార్ లాగ చేసుకుంటే రుచిగా ఉంటాయి. ఇవి ఇడ్లీ, వడ ,అన్నం లోకి బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 5

  1. మునగాకు - 1 కప్పు
  2. ఛాయపెసరపప్పు - 1 కప్పు
  3. టమాటో ముక్కలు - 1/2 కప్పు
  4. ఉల్లిపాయ - 1
  5. క్యారట్ - 1
  6. బెండకాయలు - 10
  7. బంగాళాదుంప - 1
  8. ఉప్పు - 1 చెంచా
  9. నీరు - తగినంత
  10. పసుపు - 1/4 స్పూను
  11. సాంబార్ పొడి - 1 చెంచా
  12. నూనె - 2 స్పూన్లు
  13. పోపు దినుసులు - 1 స్పూన్
  14. కర్వేపాకు - 1 రెమ్మ
  15. యండుమిర్చి - 3
  16. ఇంగువ - 1/4 స్పూన్

సూచనలు

  1. ముందుగా మునగాకు వలిచి కడిగి పెట్టుకోవాలి.
  2. ఛాయపెసరపప్పు కూడా కడిగి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు కుక్కర్ లో కడిగిన పెసరపప్పు, టమాటో ముక్కలు ,ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ ముక్కలు, బెండకాయలు ,బంగాళాదుంప ముక్కలు, ఉప్పు ,నీరు వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  4. ఇప్పుడు పసుపు ,సాంబార్ పొడి, మునగాకు ,తగినన్ని నీరు,బెల్లం, ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి.
  5. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు కర్వేపాకు యండుమిర్చి ఇంగువ వేసి చిటపటలాడాక సాంబార్ లో వేసుకోవాలి.
  6. అంతే రుచికరమైన మునగాకు సాంబార్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర