హోమ్ / వంటకాలు / కొత్తిమీర బ్రెడ్ సూర్యుని ఆకారంలో ( కుక్కర్ లో )

Photo of Coriander sun shaped twisted Bread ( With out Oven) by Pravallika Srinivas at BetterButter
1
2
0(0)
0

కొత్తిమీర బ్రెడ్ సూర్యుని ఆకారంలో ( కుక్కర్ లో )

Oct-28-2018
Pravallika Srinivas
120 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర బ్రెడ్ సూర్యుని ఆకారంలో ( కుక్కర్ లో ) రెసిపీ గురించి

ఈ బ్రెడ్ తాంగ్జోన్గ్ అనే పద్దతితో తయారు చేయ బడినది . ఈ పద్ధతిలో పాలని మరియు మైదా పిండి ని కలిపి ఉండలు లేకుండా ఉడికించుకుని బ్రెడ్ తయారు చేసే పిండి లో కలుపుకోవాలి. ఈ బ్రెడ్ చాలా మెత్తగా తేమతో యంతో రుచికరంగా ఉంటుంది. ఇందులో ఫిల్లింగ్ కోసం కొత్తిమీర, పుదీనా ,పచ్చిమిర్చి ,అల్లం ,వెల్లులిరెబ్బలు వేసి రుబ్బుకుని ఈ ఆకుల మిశ్రమాన్ని బ్రెడ్ చేసే సమయం లో మధ్యలో స్టూఫిన్గ్ కి ఉపోయోగిస్తాం. మనము మామూలు బ్రెడ్ ఆలా రుచీపచీ లేకుండా వట్టివి తినలేము. ఈ విధంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది. మరి పిల్లలను ఆకట్టుకోవాలి అంటే ఎదోఒక ప్రత్యేకం ఉండాలి కదా అందుకని బ్రెడ్ పిండిని ఇలా సూర్యుని ఆకారం లో చేసి సన్ఫ్లవర్ లాగ అలంకరించుకుంటే సరి పిల్లలు పెద్దలు చక్కగా తింటారు .

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • కఠినము
 • పిల్లల పుట్టినరోజు
 • మిడిల్ ఈస్టర్న్
 • ప్రెజర్ కుక్
 • బేకింగ్
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

 1. పాలు - 1 కప్పు ( for tangzhong)
 2. మైదా పిండి - 1/3 కప్పు ( for tangzhong)
 3. పాలు - 1/2 కప్పు
 4. పంచదార - 3 చెంచాలు
 5. ఈస్ట్ - 2 చెంచాలు
 6. మైదాపిండి - 2.5 కప్పులు
 7. ఉప్పు - 1 చెంచా
 8. వెన్న - 3 చెంచాలు
 9. కొత్తిమీర - 1 కప్పు
 10. పుదీనా - 1/4 కప్పు
 11. పచ్చిమిర్చి - 3
 12. వెల్లులిరెబ్బలు - 2
 13. అల్లం - 1 అంగుళం ముక్క
 14. ఆలివ్ ఆయిల్ - 2 చెంచాలు
 15. ప్రొద్దుతిరుగుడు గింజలు - 2 చెంచాలు
 16. నెయ్యి - 1 చెంచా

సూచనలు

 1. ముందుగా టంగ్జ్హోన్గ్ పద్ధతి కోసం మందపు గిన్ని పెట్టి 1 కప్పు పాలు పోసి 1/3 కప్పు మైదా పిండి వేసి ఉండలు లేకుండా అట్లకాడతో బాగా తిప్పుతూనే ఉండాలి.
 2. కొంచం సమయంలోనే దగ్గర పడుతుంది దీనిని ఒక బాక్స్ లో తీస్కుని వెంటనే మూత పెట్టుకోవాలి లేదంటే పైన పోరా యండిపోతుంది.
 3. అందువలన అప్పటికప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నిలో గోరు వెచ్చని పాలు ,పంచదార, ఈస్ట్ వెస్కొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
 4. ఈలోగా ఒక బేసిన్ లో మైదాపిండి ,ఉప్పు పంచదార ,వెన్న , ముందుగా తయారైన తాంగ్జ్చొంగ పిండి వేసి కలుపుకోవాలి.
 5. పైనుండి ఈస్ట్ మిశ్రమాన్ని కొంచం కొంచం వెస్కొని కొంచం జిగటగా కలుపుకోవాలి.
 6. ఇప్పుడు ఒక బండ మీద పొడి మైదా పిండి చల్లుకుని వీలైనంత సమయం అంటే ఒక 15 నిమిషాలు మర్దన చేసుకోవాలి.
 7. ఇప్పుడు అది మెత్తని పిండి ముద్దలాగా తయారవుతుంది ఎలా అంటే పిండి ముద్దను వేలితో నొక్కితే మరల పైకి వచ్చేంతగా అనమాట.
 8. ఒక పెద్ద బేసన్ లో నూనె వేసి తయారైన పిండి ముద్దకు పైన నూనె రాసి పెట్టుకుని పైన క్లింగ్ వ్రాప్ చుట్టుకోవాలి.
 9. ఆ పిండిని ఒక గంటన్నర వేడిగా ఉండే ప్రదేశంలో లేదా చీకటిగా ఉన్న ప్రదేశం లో పెట్టాలి. ఆ తర్వాత చూసినపుడు పిండి రెండింతలుగా పులుస్తుంది.
 10. ఇప్పుడు బండమీద తయారైన పిండి వేసి వేళ్ళతో నెమ్మదిగా అందులోనే గాలిపోయేలాగా వత్తుకోవాలి.
 11. తయారైన పిండిని నాలుగు భాగాలుగా చేసుకోవాలి.
 12. ఇప్పుడు ఒక్కక్క భాగం తీస్కుని పొడి మైదా పిండి సహాయం తో రౌండ్ గా చపాతీ లాగా సమాన సైజు లో వత్తుకోవాలి.
 13. ఇప్పుడు కుక్కర్ లో ఇసుక కానీ ఉప్పు కానీ వేసి పరుచుకుని పైన ఎత్తు కోసం ఒక గిన్నె పెట్టి వేడి చేసుకోవాలి.
 14. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ,ఉప్పు ,అల్లం, వెల్లులిరెబ్బలు వేసి పేస్ట్ చేస్కుని పైనుండి ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకొని ఒక గిన్నిలో తీసుకోవాలి.
 15. ఇప్పుడు ఒక అల్యూమినియం ప్లేట్ కి నెయ్యి రాసుకుని పైన మైదా పిండి తో డిస్టింగ్ చేసుకోవాలి.
 16. ఇప్పుడు తయారైన రొట్టెలలో ఒకటి తీస్కుని ప్లేట్ మీద పెట్టుకుని తయారు హేసినా కొత్తిమీర మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి.
 17. పైన మరొక చపాతీ వేసి మరల కొత్తిమీర మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆలా నాలుగు పెట్టుకోవాలి.
 18. ఇప్పుడు ఒక చిన్న మూత పిండి మధ్యలో పెట్టుకోవాలి.
 19. మొదట సమానంగా భాగాలు చేసుకోవాలి.
 20. ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని రెండు భాగాలు చేసుకోవాలి. ఆలా మొత్తం సమానంగా కట్ చేసుకోవాలి.
 21. ఇప్పుడు ఒకొక్క భాగాన్ని పట్టి ట్విస్ట్ చేస్కోవడం వలన కొత్తిమీర మిశ్రమం కనిపిస్తుంది.
 22. ఆలా అన్ని భాగాలు ట్విస్ట్ చేసుకోవాలి. మధ్యలో పెట్టిన మూతను తెసివేసాలి. ఇప్పుడు మనకు సూర్యుని అకారంగా కనిపిస్తుంది.
 23. పైనుంచి తేనే పాలు కలిపిన మిశ్రమాన్ని ఒక సారి ఆదుకోవాలి. దీని వలన పైపొర తేమగా దోరగా వేగుతుంది.
 24. మూత పెట్టిన ప్రదేశం లో ప్రొద్దుతిరుగుడు గింజలు చల్లుకోవాలి
 25. ఇప్పుడు ఆ ప్లేట్ ని జాగ్రత్తగా ఒక గుడ్డతో పట్టుకుని వేడియైన కుక్కర్ లో గిన్ని పైన పెట్టుకుని కుక్కర్ గాస్కెట్ మరియు విసెల్స్ తీసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
 26. మద్యమద్యలో చెక్ చేస్తూ ఉండాలి. రంగు మారగానే స్టవ్ ఆఫ్ చేసుకోని ఒక 5 నిమిషాలుచల్లారనివ్వాలి.
 27. ఇప్పుడు మరికొంచం రంగుమారుతుంది.
 28. అంతే సెర్వింగ్ ప్లేట్ లో తీస్కుని కర్వేపాకు రెమ్మతో సన్ఫ్లవర్ లాగ అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర