హోమ్ / వంటకాలు / పాలకూర కూరగాయలు పులావ్

Photo of Spinach veggie pulav by Lalitha Kandala at BetterButter
490
1
0.0(0)
0

పాలకూర కూరగాయలు పులావ్

Oct-29-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర కూరగాయలు పులావ్ రెసిపీ గురించి

పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు మరియు కూరగాయలు కలిపి పులావ్ రుచి, ఆరోగ్యం కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర తరుగు 2 కప్స్
  2. కొత్తిమీర 1 కప్
  3. పుదీనా 1 కప్
  4. పర్చిమిర్చి 5
  5. పచ్చి బఠాని 1/2 కప్
  6. క్యారెట్ , ఉల్లిపాయలు, కాలీఫ్లవర్ ముక్కలు 2 కప్స్
  7. పులావ్ సామాన్లు
  8. నూనె కొద్దిగా
  9. జీడిపప్పు 1 టేబుల్ స్పూన్
  10. అల్లం, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా పాలకూర, కొత్తిమీర, పుదీనా అల్లం, వెల్లుల్లి , నిమ్మ రసం, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చెయ్యాలి
  2. ఒక పాన్ లో నూనె వేసి ఇలాచి, దాల్చిన చెక్క, జీడిపప్పు, పులావ్ ఆకు, షాజీరా వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, కూరగాయలు కూడా వేసి వేయించాలి.
  3. తరువాత పాలకూర పేస్ట్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి. 1 కప్ బియ్యం కడిగి 30 నిమిషాలు నానబెట్టి ఇందులో వెయ్యాలి
  4. ఉప్పు, బిర్యానీ మసాలా కూడా వేసి బాగా కలపాలి
  5. 2 కప్స్ నీళ్లు పోసి , మూతపెట్టి ఉడికించాలి.
  6. మధ్యలో ఒక్కసారి కలిపి సన్నని మంటపై ఉడికించాలి.
  7. పులావ్ ఉడికాక దించి రైత తో సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర