కర్వేపాకు పల్లి పకోడీ | Curry leaf spicy peanut fritters Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  29th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Curry leaf spicy peanut fritters by Pravallika Srinivas at BetterButter
కర్వేపాకు పల్లి పకోడీby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

కర్వేపాకు పల్లి పకోడీ వంటకం

కర్వేపాకు పల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaf spicy peanut fritters Recipe in Telugu )

 • కర్వేపాకు - 1/2 కప్పు
 • పల్లీలు - 1 కప్పు
 • పచ్చిమిర్చి - 1
 • కారం - 1/4 స్పూన్
 • ఉప్పు - 1/4 స్పూన్
 • అల్లం - 1/2 అంగుళం ముక్క
 • వెల్లులిరెబ్బలు- 2
 • శనగపిండి - 2 చెంచాలు
 • బియ్యంపిండి - 2 చెంచాలు
 • జీలకర్ర పొడి - 1/4 చెంచా
 • నూనె - తగినంత
 • పసుపు చిటికెడు

కర్వేపాకు పల్లి పకోడీ | How to make Curry leaf spicy peanut fritters Recipe in Telugu

 1. ముందుగా ఒక మిక్సర్ జార్ లో కడిగిన కర్వేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లులిరెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 2. ఇప్పుడు ఒక గిన్నిలో పల్లీలు ఉప్పు పసుపు కారం కర్వేపాకు పేస్ట్ వేసుకోవాలి.
 3. అందులో కొంచం శనగపిండి బియ్యం పిండి జీలకర్ర పొడి వేసి తాగింనని నీరు పోసి గట్టిగ కలుపుకోవాలి.
 4. కడై పెట్టి నూనె వేసి పల్లెలను విడివిడిగా వేస్కుని డీపీఫ్రై చేసుకోవాలి.
 5. అంతే రుచికరమైన కర్వేపాకు పల్లి పకోడీ రెడీ.

నా చిట్కా:

చిన్న మంట మీద వేపుకోవాలి లేదంటే లోపల పచ్చిగా పైన మాడిపోతాయి .ఇలాగే పుదీనా కొత్తిమీర మెంతికూర తో కూడా ట్రై చేయచ్చు.

Reviews for Curry leaf spicy peanut fritters Recipe in Telugu (0)