హోమ్ / వంటకాలు / తులసి ఆలూ సమోసా

Photo of Basil Potatoes Samosa by Pravallika Srinivas at BetterButter
724
1
0.0(0)
0

తులసి ఆలూ సమోసా

Oct-31-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసి ఆలూ సమోసా రెసిపీ గురించి

తులసి ఆకు వాళ్ళ జలుబు దగ్గు మరియు ఇతర ఫ్లూ కి బాగాపని చేస్తుంది. రోజు అలాగైనా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తులసి ఆకుని కొంచం వేడి నీటితో కడిగి పేస్ట్ లాగ చేసి సమోసా పోత పిండిలో కలిపాను. లోపల ఆలూ స్టూఫిన్గ్ చేశాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తులసి ఆకులు - 1 కప్పు
  2. నీరు - తగినంత
  3. ఉప్పు - 1 స్పూను
  4. మైదా - 1 కప్పు
  5. ఆలూ - 3
  6. కారము - 1/2 స్పూను
  7. గరం మసాలా - 1/2 స్పూను
  8. చాట్ మసాలా - 1/4 స్పూను
  9. నిమ్మరసం - 1 స్పూను
  10. కొత్తిమీర - 4 రెమ్మలు
  11. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా తులసి ఆకులు గిల్లి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్ని లో నీరు వేడి చేస్కుని తులసి ఆకులను ముంచి తీసేయాలి.
  3. ఒకమిక్సర్ జార్ లో చల్లారిన తులసి ఆకులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  4. ఒక బేసన్ లో మైదా, ఉప్పు ,తులసీపేస్ట్ వేసి కలుపుకుని తగినన్ని నీరు పోసుకొని ముద్దలాగా కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  5. ఈలోగా ఆలూ ని ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత పొత్తు తీసి మెత్తగా మెదుపుకోవాలి.
  6. అందులో ఉప్పు ,కారము గరం మసాలా, చాట్ మసాలా ,నిమ్మరసం ,కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
  7. ఇప్పుడు తయారైన పిండి ముద్దను ఉండలు చేసి పల్చని చపాతిలాగా వత్తుకోవాలి.
  8. ఒక్కొక్క చపాతీని రెండు భాగాలు చేసుకోవాలి.
  9. ఒకభాగం తీస్కుని కోన్ లాగ చేసుకోవాలి.
  10. అందులో ఆలూ మిశ్రమం పెట్టుకుని అంచులను మూసివేయాలి.
  11. ఇప్పుడు అన్ని సమోసాలు ఇదే విధం చేసి పెట్టుకోవాలి.
  12. కడాయిలో నూనె వేసి కాగాక డీపీఫ్రై చేసుకోవాలి.
  13. అంతే రుచికరమైన తులసి ఆలూ సమోసాలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర