హోమ్ / వంటకాలు / పాలక్ లేయర్డ్ పరాటా

Photo of Palak layered patata by రమ్య వూటుకూరి at BetterButter
437
0
0.0(0)
0

పాలక్ లేయర్డ్ పరాటా

Oct-31-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ లేయర్డ్ పరాటా రెసిపీ గురించి

లేయర్డ్ పరాటాలు అంటే అందరికీ ఇష్టం. బైట హోటల్స్ లో చేసే వాటిలో మైదా వాడతారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. మనం ఇంట్లోనే చక్కగా పాలకూర గోధుమపిండితో పరాటాలు చేస్కోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యం కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలకూర 2 కట్టలు
  2. గోధుమపిండి 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. పాలు 1/4 కప్
  5. పంచదార 1 స్పూన్
  6. ఉప్మారవ్వ 1 స్పూన్
  7. నెయ్యి 4 స్పూన్స్

సూచనలు

  1. పాలకూర ఉడకబెట్టి పేస్ట్ చేసుకోవాలి
  2. గోధుమపిండి లో పాలకూర పేస్ట్ ఉప్పు పాలు ఉప్మారవ్వ పంచదార వేసి బాగా కలుపుకోవాలి
  3. అవసరం అయితే నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి
  4. దీన్ని 30 నిముషాలు మూటపెట్టి ఉంచాలి
  5. అరగంట తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి పల్చని చపాతీ లా వొత్తుకోవాలి
  6. చపాతీ పైన నెయ్యి రాసి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి
  7. ఇప్పుడు ఒక వైపు నుండి చుట్టు కొంటూ రావాలి
  8. దీనిపై కొంచెం నెయ్యి రాసి నెమ్మదిగా కొంచం సాగదీసి చుట్టుకోవాలి
  9. చేత్తో చపాతీ లా వత్తుకోవాలి
  10. నెమ్మదిగా అప్పడాల కర్రతో వత్తాలి
  11. దీన్ని రెండు వైపులా నెయ్యితో బాగా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి
  12. ఆలూ కుర్మా లేక ఏదైనా మసాలా కర్రీ తో బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర