హోమ్ / వంటకాలు / మునగాకు కందిపప్పు

Photo of Drumstick leaves with Red gram by Swapna Tirumamidi at BetterButter
467
3
0.0(0)
0

మునగాకు కందిపప్పు

Oct-31-2018
Swapna Tirumamidi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు కందిపప్పు రెసిపీ గురించి

మునగాకు గురించి అందరికీ తెలిసిందే.మునగాకును సర్వరోగ నివారిణి అనడం అతిశయోక్తి కాదేమో.దీనిని పప్పుతో కలిపి వండడంవల్ల మునగాకులో వుండే పోషకాలతో పాటు పప్పులో వుండే మాంసకృతులు కూడా మన శరీరానికి అందుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మునగాకు 4 కప్పులు
  2. కందిపప్పు ఒకకప్పు
  3. వెల్లుల్లిపాయలు 8 రెబ్బలు
  4. ఆవాలు అర చెంచా
  5. జీలకర్ర పావు చెంచా
  6. ఇంగువ కొద్దిగా
  7. పసుపు చిటికెడు
  8. పచ్చిమిర్చి 2
  9. ఎండుమిర్చి 2
  10. అల్లం ముక్కలు సన్నగా పొడవుగా తరిగినవి 1 చెంచాడు
  11. కరివేపాకు (ఆప్షనల్)
  12. ఉప్పు రుచికి తగినంత.
  13. నూని 4 చెంచాలు

సూచనలు

  1. మునగాకు ఈనెలు లేకుండా ఆకు విడిగా తీసి శుభ్రంగా కడిగి నీరువాడేసి పక్కన పెట్టుకోవాలి.
  2. కందిపప్పు ఒకసారి కడిగి వార్చి అడుగు మందపాటి గిన్నీలో 3 గ్లాసుల నీళ్ళు పోసి కందిపప్పుని అందులో వేసి,చిటికెడు పసుపు వేసి విడిగా ఉడికించుకోవాలి.
  3. ఇప్పుడు పక్క పొయ్యిమీద మూకుడు పెట్టి నూనెవేసి కాగాక ఆవాలు సగం...జీలకర్ర సగం...ఇంగువ, పచ్చి మిర్చి ,అల్లం ముక్కలు,పసుపు ,ఉప్పు కొంచెం...వేసి కమ్మగా వేయించి...మునగాకును కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి పచ్చివాసన పోయేదాక మగ్గించుకోవాలి.
  4. ఆకు బాగా మగ్గాక ఉడికిన కందిపప్పుని ఇందులో వేసి,ఉప్పు సరిపడా వేసి కలిపి , 5 నిమిషాలు అలా ఉడకనివ్వాలి.
  5. ఇప్పుడు పోపుగరిటలో కొంచం నూనె వేసి మిగిలిన ఆవాలు..జీలకర్ర... ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు....కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే కమ్మటి మునగాకు కందిపప్పు వడ్డనకు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర