హోమ్ / వంటకాలు / కొత్తిమీర క్రిస్పీ రోల్స్

Photo of coriander crispy rolls  by Kavitha Perumareddy at BetterButter
405
0
0.0(0)
0

కొత్తిమీర క్రిస్పీ రోల్స్

Oct-31-2018
Kavitha Perumareddy
30 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర క్రిస్పీ రోల్స్ రెసిపీ గురించి

ఇది కొత్తిమీరతో చేసుకునే స్నాక్ .ఇది మహారాష్ట్ర వంట .దీనిలో కొబ్బరి,నువ్వులు,పల్లిలపొడి, అన్ని వాడడం వల్ల చాలా బలవర్ధకమైనది .కొద్దిగా తియ్యగా కొద్దిగా కారంగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కొత్తిమీర ఒక పెద్ద కప్
  2. గోధుమపిండి ఒక కప్
  3. పచ్చిమిర్చి 3
  4. ఉల్లిపాయలు 3
  5. కారం ఒక స్పున్
  6. జీలకర్ర పొడి స్పున్
  7. ధనియాలు పొడి స్పున్
  8. కొబ్బరితురుము 4 స్పూన్స్
  9. పల్లిపొడి 4 స్పూన్
  10. నువ్వులు 3 స్పూన్స్
  11. గసగసాలు స్పున్
  12. చెక్కర స్పూన్
  13. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా గోధుమపిండి లో కొద్దిగా కారం ,ఉప్పు వేసి చెపాతి పిండిలా కలిపి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి జీలకర్ర వేసి పచ్చిమిర్చి ,ఉల్లిపాయలు ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తరువాత కారం,తగినంత ఉప్పు, కొబ్బరితురుము, పల్లిపొడి, గసగసాలు,నువ్వులు, ధనియాలపొడి, జీలకర్రపొడి అన్ని వేసి అంత కలిసేలా కలుపుకోవాలి.
  3. 2 నిముసాలు ఉండాలి.తరువాత కొద్దిగా చెక్కర కూడా వేసి కలపాలి.
  4. తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి
  5. ఒక 3 నిముసాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  6. రోల్స్ లోకి స్టఫ్ రెడీ.ఇప్పుడు పిండిని చిన్న ముద్దాలుగా చేసుకోవాలి.ఇలా నిమ్మకాయ సైజ్ చేసుకోవాలి.
  7. తరువాత పూరీలు లాగా ఒత్తుకొని చివర్లు కట్ చేసుకోవాలి ఇలా ...
  8. తరువాత 2 స్పూన్ కొత్తిమీర స్టఫ్ పెట్టి చాకలెట్ లాగా రోల్ చేసుకోవాలి.
  9. అన్ని చేసి పెట్టుకోవాలి .
  10. తరువాత పోయిమీద బాండీ పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసుకొని కాగినతారువత ఈ రోల్స్ అన్ని బంగారు రంగులో వేయించుకోవాలి.
  11. ఒక పేపర్ నాప్కిన్ లో వేస్తే ఎక్కువ నూనె లేకుండా పీల్చుకుంటాయి .
  12. అంతే కొత్తిమీర క్రిస్పీ రోల్స్ రెడీ .టమాటా సాస్ తో సర్వ్ చేసుకోవడమే ఇంకా..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర