హోమ్ / వంటకాలు / కొత్తిమీర, పచ్చిటమాటా పచ్చడి.

Photo of Coriander with green/raw tomato chutny. by Swapna Tirumamidi at BetterButter
250
2
0.0(0)
0

కొత్తిమీర, పచ్చిటమాటా పచ్చడి.

Nov-01-2018
Swapna Tirumamidi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర, పచ్చిటమాటా పచ్చడి. రెసిపీ గురించి

కొత్తిమీర టమాటా పచ్చడి అనగానే ఇందులో ఏముంది అందరికీ తెలుసు అనుకోవచ్చు.కానీ ఇది కొంచెం వైవిధ్యంగా ఉంటుంది.రుచి బావుంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరి.టమాటా ఇంట్లో పండించుకునేవారు ఈ పచ్చడి సులువుగా చేసుకోవచ్చు.బజారులో టమాటపళ్ళు దొరుకుతాయిగానీ. ఈ పచ్చిటమాటాలు దొరకవు కదా.అందుకే ఇది ఎప్పుడు తినాలంటే అప్పుడు తినలేము కూడా.పచ్చి టమాటాలలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. కొత్తిమీర ఒకకట్ట
  2. పుదీనా గుప్పెడు ఆకులు
  3. పచ్చి టమాటాలు 5..6(ఆకుపచ్చని టమాటాలు)
  4. పచ్చి మిర్చి5
  5. ఎండుమిర్చి 5
  6. వెల్లుల్లి రెబ్బలు3
  7. ఆవాలు అరస్పూన్
  8. మెంతులు అర స్పూన్
  9. జీలకర్ర అర స్పూన్
  10. మినపప్పు ఒక స్పూన్
  11. చింతపండు గుజ్జు ఒక స్పూన్
  12. కరివేపాకు కొద్దిగా
  13. నూనె 5 చెంచాలు.
  14. పసుపు చిటికెడు
  15. ఉప్పు రుచనుసారం
  16. జాజికాయ పొడి చిటికెడు.
  17. ఇంగువ చిటికెడు.

సూచనలు

  1. ముందు టమాటాలు ,కొత్తిమీర,పుదీనా శుభ్రంగా కడిగి ...తరిగిపెట్టుకోవాలి.
  2. మెంతులు,పచ్చి మిర్చి,వెల్లుల్లి తప్ప...మిగతా పోపు సామాను అంతా సగం విడిగా పెట్టుకోవాలి.
  3. మూకుడు వేడిచేసి నూనె వేసి ...మెంతులు,ఆవాలు,మినప్పప్పు,జీలకర్ర,ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి వేయించి ....తరిగి పెట్టుకున్న టమాటముక్కలు వేసి,పసుపు ఉప్పు వేసి మగ్గించుకోవాలి.
  4. అవి కొంచం మగ్గినతరువాత చింతపండు గుజ్జు, కొత్తిమీర, పుదీనా వేసి మూతపెట్టి బాగా ఉడికెవరకు మగ్గించాలి.
  5. ఇప్పుడు పోయ్యి కట్టేసి చల్లారబెట్టుకోవాలి
  6. చల్లారిన టమాటా, కొత్తిమీర ని,పచ్చి వెల్లుల్లి ని మిక్సీలో వేసి కచ్చపచ్చగా రుబ్బు కొని వేరే గిన్నీలోకి తీసుకోవాలి.
  7. ఇప్పుడు మళ్ళీమూకుడు పెట్టి,నూనె వేసి... ఇందాక విడిగాపెట్టుకున్న పోపు సామాను , జాజి కాయపొడి,ఇంగువ,కరివేపాకు వేసి వేయించి కమ్మటి పోపు పెట్టుకోవాలి.
  8. అంతే ఘుమ ఘుమలాడే చక్కటి రుచికరమైన కొత్తిమీర టమాట పచ్చడి రెడీ... దోసెలు,ఇడ్లి,అన్నం,రోటీ ఇలా అన్నిటిలోకి ఇదిచాలా బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర