హరా భరా కబాబ్. | Green veg katlets Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  1st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Green veg katlets by Swapna Sashikanth Tirumamidi at BetterButter
హరా భరా కబాబ్.by Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

3

0

హరా భరా కబాబ్. వంటకం

హరా భరా కబాబ్. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green veg katlets Recipe in Telugu )

 • పాలకూర పెద్దకట్ట ఒకటి
 • 1 క్యాప్సికమ్ తరుగు
 • బీన్స్ తరుగు ముప్పావు కప్
 • గ్రీన్ పీస్ ముప్పావు కప్
 • 2 బంగాళదుంపలు ఉడికించిన ముద్ద
 • పన్నీర్ తురుము 1 కప్
 • పచ్చిమిర్చి ఒకటి/ రెండు
 • కొత్తిమీర తురుము అర కప్
 • కార్న్ ఫ్లోర్ 1 చెంచా
 • బ్రెడ్ పొడి 2 చెంచాలు
 • కారం ఒక చెంచా.
 • ధనియాల పొడి అర చెంచా
 • ఆమ్ చూర్ 1 చెంచా
 • గరంమసాలా పొడి అర చెంచా
 • పసుపు 2 చిటికెళ్ళు
 • ఉప్పు సరిపడా
 • బ్రెడ్ పొడి ఒక కప్ బైండింగ్ కోసం.
 • జీడిపప్పు బద్దలు 10 నుంచి 15.
 • నూనె డీప్ ఫ్రై చెయ్యడానికి తగినంత.

హరా భరా కబాబ్. | How to make Green veg katlets Recipe in Telugu

 1. పాలకూరని శుభ్రంచేసి,కడిగి,2 నిమిషాలు ఉడికించి మిక్సీలో మెత్తగా చేసి పట్టుకోవాలి.
 2. మూకుడుపెట్టి 2 చెంచాల నూని వేసి వేడిచేసి...పచ్చి మిర్చి,క్యాప్సికమ్ తరుగు, బీన్స్ తరుగు,గ్రీన్ పీస్,వేసి వేయించాలి.
 3. ఇప్పుడు పాలకూర ముద్దలో ఈ వేయించిన ముక్కలు కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.అసలు నీరు వెయ్య కూడదు.
 4. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక పెద్దగిన్నిలోకి తీసికొని.... అందులో ఉడికించిన ఆలూ ముద్ద,పన్నీర్ తురుము,కొత్తిమీర తురుము,1 చెంచా కార్న్ ఫ్లోర్,2 చెంచాల బ్రెడ్ పొడి,ధనియాలపొడి,గరం మసాలా పొడి,కారం,పసుపు,ఉప్పు,ఆమె చూర్...అన్నీ వేసి బాగా కలిసేట్టుగా కలిపి పెట్టుకోవాలి.
 5. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయ పరిమాణం లో ఉండలు చేసి అరచేతిలో పెట్టుకుని వడలు/కట్లెట్స్ లాగా చెయ్యాలి.
 6. ఇప్పుడు వేరే ప్లాటిలోకి ఒక కప్ బ్రెడ్ పొడి వేసి తయారుచేసిన కట్లెట్స్ ని అద్ది బ్రెడ్ పొడి తో కవర్ చేసి, మధ్యలో పైకి కనిపించే విధంగా జీడిపప్పును అద్దాలి.
 7. ఇప్పుడు దేవడానికి సరిపడే అంత నూనె మూకుడులో పోసి కాగాక... నాలుగేసి కబాబుల చప్పున నూనెలో జాగర్తగా వేయించి,కొద్దిగా ఎరుపు రంగు రాగానే బయటకు తీసి టిష్యూ పేపర్ మీదకి తీసి పెట్టుకోవాలి.
 8. అంతే వేడివేడి చక్కటి కమ్మటి హరా భారా కబాబ్ రెడీ మరి....గ్రీన్ చట్నీ ,సన్నగతరిగిన వెజ్ సలాడ్ తో ప్లేటింగ్ చేస్తే అద్భుతః :ok_hand: :ok_hand: :ok_hand: :wink:.

నా చిట్కా:

కబాబ్ ను వెయిచేటప్పుడు ఎక్కువగా కడపకూడదు...లేదంటే జీడిపప్పు విడిగా నూనెలోకి జారిపోతుంది .

Reviews for Green veg katlets Recipe in Telugu (0)