హోమ్ / వంటకాలు / పాలకూర ఉల్లి పెసరట్టు
పెసలు కడిగి ఒక 5 గంటలు నానపెట్టాలి. ముందుగా పాలకూర కడిగి పెట్టి చివర్లు కట్ చేసుకోవాలి. ఒక మిక్సర్ జార్ లో పెసలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నిలోకి తీసుకోవాలి.ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెనం పెట్టి వేడి అక్కక పిండిని గుంటగరిటతో తీస్కుని పల్చగా గుండ్రంగా వేసుకోవాలి. పైన ఉల్లితరుగు అల్లం తరుగు కొత్తిమీర తరుగు చల్లుకొని నూనె వేసి సన్న మంట పైన కాల్చుకోవాలి. పైన అట్లకాడతో స్ప్రెడ్ చేయడం వలన పైనకూడా ఉడికిపోతుంది. ట్రయాంగ్యులర్ గా ఫోల్డ్ చేస్కుని మనకు నచ్చిన చట్నీ తో తినేయాలి. పాలకూర ఉల్లి పెసరట్టు పొద్దున అల్పాహారమ్ గా బాగుంటుంది .
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి