హోమ్ / వంటకాలు / కార్న్ మేథీ చమన్

Photo of Corn fenugreek gravy curry by Pravallika Srinivas at BetterButter
394
2
0.0(0)
0

కార్న్ మేథీ చమన్

Nov-01-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్న్ మేథీ చమన్ రెసిపీ గురించి

కార్న్ మేథీ చమన్ రోటి నాన్ చపాతీ పూరి లోకి మంచి కాంబినేషన్. జీరా రైస్ ప్లైన్ రైస్ లో కూడా బాగుంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర - 1/2 కట్ట
  2. మెంతికూర - 1 కట్ట
  3. కొత్తిమీర - రెమ్మలు
  4. అల్లం వెల్లులి - 1 స్పూను
  5. బిర్యాని ఆకు - 1
  6. లవంగం - 4
  7. షాజీరా - 1/2 స్పూను
  8. పట్టా - 2 అంగుళాలు
  9. యాలకలు - 4
  10. అల్లం వెల్లుల్లి స్ట్రిప్స్ - 1 స్పూను
  11. పచ్చిమిర్చి చీలికలు - 8
  12. గరం మసాలా - 1/2 స్పూను
  13. వెజిటల్ మసాలా - 1/2 స్పూను
  14. వెన్న - 2 స్పూను
  15. పసుపు - 1/4 స్పూను
  16. ఉప్పు - తగినంత
  17. కార్న్ గింజలు - 3 స్పూనులు
  18. పాల మీద మీగడ - 2 స్పూనులు
  19. టమాటో ప్యూరీ - 1 స్పూను
  20. నీరు - తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర, మెంతికూర, కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నిలో నీరు వేసి మెంతికూర పాలకూర వేసి మూత లేకుండా ఉడికించుకోవాలి.
  2. ఒక ప్లేట్ లోకి తీస్కుని చల్లని నీటితో కడిగి పెట్టుకోవాలి.
  3. ఒక మిక్సర్ జార్ లో పాలకూర మెంతికూర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.అల్లం వెల్లులి పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు మసాలా దినుసులు బిర్యాని ఆకు, లవంగం ,షాజీరా, పట్టా, యాలకలు, అల్లం వెల్లుల్లి స్ట్రిప్స్, పచ్చిమిర్చి చీలికలు, గరం మసాలా, వెజిటల్ మసాలా సిద్ధం చేసుకోవాలి.
  5. కడాయి పెట్టి వెన్న వేసి కాగాక మసాలా దినుసులు అన్ని వేసుకుని చిటపటలాడాక మెంతికూర వేసి పచ్చి వాసన పోయేవరకు వేగనివ్వాలి.
  6. ఆకుకూరల పేస్ట్ ,అల్లం వెల్లులి పేస్ట్, పసుపు ,ఉప్పు కూడా పచ్చి వాసన పోయేవరకు వేగనివ్వాలి.
  7. ఇప్పుడు కొంచం టమాటో ప్యూరీ కూడా వేసుకుని కలుపుకోవాలి.
  8. ఆ పైన కార్న్ గింజలు వేసి నీరు వేసి ఉడికించుకోవాలి.
  9. పైన కొంచం పాల మీద మీగడ కూడా వేసి కలుపుకోవాలి.
  10. దగ్గర పడి నూనె విడవగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  11. డిష్ అవుట్ చేసి పైన కొత్తిమీర చల్లుకోవాలి అంతే రుచికరమైన కార్న్ మేతి చమన్ రెడీ ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర