హోమ్ / వంటకాలు / తమలపాకు కొబ్బరిబర్ఫీ

Photo of betel leaves coconut burfi by Kavitha Perumareddy at BetterButter
877
8
0.0(0)
0

తమలపాకు కొబ్బరిబర్ఫీ

Nov-01-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు కొబ్బరిబర్ఫీ రెసిపీ గురించి

తమలపాకు తింటే మనం తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. భోజనం తరువాత తినడానికి ఈ స్వీట్ చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. తమలపాకులు 10
  2. ఎండు కొబ్బరితురుము ఒక కప్
  3. చెక్కర ఒక కప్
  4. యాలకుల పొడి స్పున్
  5. ఎండుద్రాక్ష 3 స్పున్
  6. బాదం ముక్కలు 3 స్పూన్స్
  7. జీడిపప్పు ముక్కలు 3 స్పూన్
  8. టూటి ఫ్రూట్ 3 స్పూన్స్
  9. సోంపు 1 స్పున్
  10. కలర్ స్వీట్ సోంపు 3 స్పున్ డెకరేషన్ కొరకు
  11. మిఠాయి పాన్ 3 స్పూన్స్ ...పాన్ లో వేసే మిఠాయి పైన డెకరేషన్ కు
  12. కలర్ షుగర్ చిప్స్ 3 స్పూన్స్ డెకరేషన్ కొరకు

సూచనలు

  1. తమలపాకులు కడిగి ఆరిన తరువాత చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి చెక్కర ,చిన్న గ్లాస్ వాటర్ వేసి కాగనివ్వాలి .తీగపాకం వచ్చిన తరువాత స్టవ్ సిమ్ లో పెట్టి డ్రై ఫ్రూట్స్,టూటి ఫ్రూట్స్, వేసి కలపాలి.తమలపాకు ముక్కలు కూడా వేసుకొని కాసేపు పాకంలో ఉడకనివ్వాలి .
  3. తరువాత యాలకుల పొడి ,సోంపు వేసి కలపాలి.
  4. తరువాత కొబ్బరితురుము, కలర్ సోంపు,షుగర్ చిప్స్ వేసుకోవాలి.
  5. అంతా కలిసేలా కలిపి కొద్దిగసేపు ఉండాలి.గట్టిగా ఐపోకూడదు ...ఇలా క్రింద పిక్ లో లాగా ఉండాలి.
  6. తరువాత నెయ్యి రాసిన ప్లేట్లో వేసి సమంగా సర్దుకోవాలి.పైన కలర్ సోంపు,కలర్ షుగర్ చిప్స్ వేసి కొద్దిగా వత్తుకోవాలి.అప్పుడు అవి అందంగా విడిపోకుండా అతుక్కుని ఉంటాయి.
  7. చల్లారిన తరువాత రౌండ్ గా వుండే కట్టర్ తీసుకొని కట్ చేసుకోవాలి .మరీ చల్లరిపోకూడదు .కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే బాగా వస్తాయి.మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు .
  8. తరువాత ఈ ముక్కలపైన పాన్ లో వేసే మిఠాయి కొద్దిగా పెట్టుకొని పైన షుగర్ చిప్స్ ,కొబ్బరితురుము,టూటి ప్రూటి తో అలంకరించి సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర