కర్వేపాకు కారంపొడి / నల్లకారం | Curry leaf gun powder Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  1st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Curry leaf gun powder recipe in Telugu,కర్వేపాకు కారంపొడి / నల్లకారం, Pravallika Srinivas
కర్వేపాకు కారంపొడి / నల్లకారంby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

19

0

కర్వేపాకు కారంపొడి / నల్లకారం వంటకం

కర్వేపాకు కారంపొడి / నల్లకారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaf gun powder Recipe in Telugu )

 • పొట్టు శనగలు - 1 టీ గ్లాస్
 • పొట్టు మినప్పప్పు - 1 టీ గ్లాస్
 • ధనియాలు - 1 టీ గ్లాస్
 • జీలకర్ర - 1/4 టీ గ్లాస్
 • వెల్లుల్లిపాయలు - 2
 • చింతపండు - 50 గ్రాములు
 • కర్వేపాకు - 2 కప్పులు
 • ఉప్పు - 1/2 టీ గ్లాస్
 • ఇంగువ - 1/2 స్పూన్
 • నూనె - 4 స్పూన్లు
 • ఎండుమిర్చి - 50 గ్రాములు

కర్వేపాకు కారంపొడి / నల్లకారం | How to make Curry leaf gun powder Recipe in Telugu

 1. ముందుగా కర్వేపాకు వలిచి కడిగి పల్చటి గుడ్డ పైన ఆరపెట్టుకోవాలి.
 2. ఈలోగా కాలాయి పెట్టి నూనె లేకుండా విడివిడిగా పొట్టు శనగలు, పొట్టు మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకోవాలి.
 3. వెల్లులిపాయలు వెల్లులిరెబ్బలు గా తీసి పెట్టుకోవాలి.
 4. కడాయిలో నూనె వేసి సగం కర్వేపాకు వేయించుకోవాలి. చింతపండు పుల్లలు వలిచి పెట్టుకోవాలి.
 5. కడాయిలో నూనె వేసి యండుమిర్చి వేయించుకోవాలి.
 6. ఇప్పుడు మిక్సర్ జార్ లో వేయించిన పప్పులు ధనియాలు జీలకర్ర అన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
 7. ఇప్పుడు వేయించిన కర్వేపాకు, యండుమిర్చి ,పచ్చికర్వేపాకు, ఇంగువ ,ఉప్పు వేసి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకోవాలి.
 8. పొడిని మిక్సర్ జార్ లో వేసి చింతపండు, వెల్లులిరెబ్బలు వేసి లైట్ గా గ్రైండ్ చేసుకోవాలి.
 9. చింతపండు వెల్లులిరెబ్బలు లోని తేమ వలన కొంచం ముద్దగా అవుతుంది కొంచం చల్లారగాని గాలి దూరని సీసాలో భద్రపరుచుకోవాలి.
 10. అంతే రుచికరమైన కారప్పొడి రెడీ

నా చిట్కా:

మిక్సర్ జార్ ,సీసా లో కానీ పొడిలో వాడే వస్తువులు తడి లేకుండా చూసుకోవాలి.

Reviews for Curry leaf gun powder Recipe in Telugu (0)