హోమ్ / వంటకాలు / కర్వేపాకు కారంపొడి / నల్లకారం

Photo of Curry leaf gun powder by Pravallika Srinivas at BetterButter
552
8
0.0(0)
0

కర్వేపాకు కారంపొడి / నల్లకారం

Nov-01-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్వేపాకు కారంపొడి / నల్లకారం రెసిపీ గురించి

కర్వేపాకు కారంపొడి దోస ఇడ్లీ పునుగులు పెరుగులో కలిపి చపాతీ పూరి ఇలా ఏ అల్పాహారానికి అయినా చాలా బాగుంటుంది. మా ఇంట్లో 365 రోజులు ఉండాల్సిందే. తయారీ విధానం చూసేద్దామా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. పొట్టు శనగలు - 1 టీ గ్లాస్
  2. పొట్టు మినప్పప్పు - 1 టీ గ్లాస్
  3. ధనియాలు - 1 టీ గ్లాస్
  4. జీలకర్ర - 1/4 టీ గ్లాస్
  5. వెల్లుల్లిపాయలు - 2
  6. చింతపండు - 50 గ్రాములు
  7. కర్వేపాకు - 2 కప్పులు
  8. ఉప్పు - 1/2 టీ గ్లాస్
  9. ఇంగువ - 1/2 స్పూన్
  10. నూనె - 4 స్పూన్లు
  11. ఎండుమిర్చి - 50 గ్రాములు

సూచనలు

  1. ముందుగా కర్వేపాకు వలిచి కడిగి పల్చటి గుడ్డ పైన ఆరపెట్టుకోవాలి.
  2. ఈలోగా కాలాయి పెట్టి నూనె లేకుండా విడివిడిగా పొట్టు శనగలు, పొట్టు మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకోవాలి.
  3. వెల్లులిపాయలు వెల్లులిరెబ్బలు గా తీసి పెట్టుకోవాలి.
  4. కడాయిలో నూనె వేసి సగం కర్వేపాకు వేయించుకోవాలి. చింతపండు పుల్లలు వలిచి పెట్టుకోవాలి.
  5. కడాయిలో నూనె వేసి యండుమిర్చి వేయించుకోవాలి.
  6. ఇప్పుడు మిక్సర్ జార్ లో వేయించిన పప్పులు ధనియాలు జీలకర్ర అన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  7. ఇప్పుడు వేయించిన కర్వేపాకు, యండుమిర్చి ,పచ్చికర్వేపాకు, ఇంగువ ,ఉప్పు వేసి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకోవాలి.
  8. పొడిని మిక్సర్ జార్ లో వేసి చింతపండు, వెల్లులిరెబ్బలు వేసి లైట్ గా గ్రైండ్ చేసుకోవాలి.
  9. చింతపండు వెల్లులిరెబ్బలు లోని తేమ వలన కొంచం ముద్దగా అవుతుంది కొంచం చల్లారగాని గాలి దూరని సీసాలో భద్రపరుచుకోవాలి.
  10. అంతే రుచికరమైన కారప్పొడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర