కొత్తిమీర గుత్తివంకాయ కూర. | Brinjal curry stuffed with coriander . Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  1st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Brinjal curry stuffed with coriander . by Swapna Sashikanth Tirumamidi at BetterButter
కొత్తిమీర గుత్తివంకాయ కూర.by Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

26

0

కొత్తిమీర గుత్తివంకాయ కూర. వంటకం

కొత్తిమీర గుత్తివంకాయ కూర. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal curry stuffed with coriander . Recipe in Telugu )

 • లేత వంకాయలు అరకేజీ
 • కొత్తిమీర ఒకకట్ట
 • అల్లం ముక్క అంగుళం సైజ్
 • పచ్చి మిర్చి 6
 • జీలకర్ర అరచెంచాడు.
 • ఉప్పు రుచికి తగినంత.

కొత్తిమీర గుత్తివంకాయ కూర. | How to make Brinjal curry stuffed with coriander . Recipe in Telugu

 1. కొత్తిమీర బాగుచేసి,కడిగి మిక్సీ జార్లో వేసి,ఉప్పు, పసుపు,జీలకర్ర,అల్లం,పచ్చిమిర్చి వేసి ముద్దలా పేస్ట్ చేసుకోవాలి.
 2. వంకాయలని కడిగి,గుత్తి లా తరిగి నీళ్లలో వేసి ఉంచుకోవాలి.
 3. ఇప్పుడు రుబ్బిన ముద్దని వంకాయల్లో కూరాలి.
 4. ఇలా అన్ని కూరి పెట్టుకుని, పొయ్యిమీద మూకుడు పెట్టి బటర్ వేసి ఒక్కొక్క వంకాయని మూకుడులో వేసి మూత పెట్టి వేయించుకోవాలి..
 5. మధ్యమధ్యలో వంకాయలని రెండోవైపు తిప్పుతూ ,కొద్దిగా నీళ్లు చిలకరించి మళ్ళీ మూతపెట్టి ఉడికించుకోవాలి.
 6. వంకాయ బాగా ఉడికిండూలేదో చూడాలంటే ముచ్చిక దగ్గర నొక్కి చూస్తే తెలిసిపోతుంది.మెత్తగా ఉంటే బాగా ఉడికినట్టు లెఖ్ఖ.ఇప్పుడు ఒకసారి ఈ విధంగా చూసుకుని...దించి సర్వింగ్ బౌల్ లోకి మార్చుకోవాలి.
 7. అంతే అమోఘమైన వంకాయ కొత్తిమీర కారం కూర రెడి.

నా చిట్కా:

వంకాయ కూర వండుతున్నప్పుడు కాయలని గరిటతో కలపకుండా మూకుడు ని కదుపుతూ కలపాలి..అప్పుడు కాయపళంగా చితికిపోకుండా ఉంటుంది.

Reviews for Brinjal curry stuffed with coriander . Recipe in Telugu (0)