BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రవ్వ కజ్జికాయ

Photo of Sooji gujiya  by Tejaswi Yalamanchi at BetterButter
0
3
0(0)
0

రవ్వ కజ్జికాయ

Nov-02-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కజ్జికాయ రెసిపీ గురించి

కజ్జికాయలు భారతదేశమున లభ్యమయ్యే ఒకరకమైన మిఠాయిలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మైదా 1 కప్
  2. ఉప్పు 1/2 చెంచా
  3. నెయ్యి 2 పెద్ద చెంచా
  4. నీరు తగినంత
  5. ఉప్మా రవ్వ 1 కప్
  6. పంచదార 1/2 కప్
  7. వేయించిన జీడిపప్పు 7-8
  8. వేయించిన కిస్మిస్ 7-8
  9. యాలుకల 1/4 tsp
  10. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఒక చెంచా నూనె వేసి ఉప్మా రవ్వని కాస్త ఎరుపు రంగు వచ్చే వరకు వేయించండి.
  2. దానిని ఒక గిన్నె లో కి తీసుకొని పంచదార,వేయించిన కిస్మిస్, జీడిపప్పు,యాలుకల పొడి వేసి కలపండి.
  3. అంతే కజ్జికాయ నింపటానికి మిశ్రమం రెడీ అయిపోయింది.
  4. ఒక గిన్నె లో మైదా పిండి,ఉప్పు,నెయ్యి వేసుకొని కలిపి,నీరు కాస్త కాస్త పోసుకుంటూ చపాతి పిండి లా కలుపుకోండి. పిండిని 10 నిమిషాల పాటు నాన బెట్టుకోండి.
  5. చిన్న చిన్న చపాతీల్లాగా గుండ్రంగా ఒత్తుకోవాలి.
  6. రుద్దిన ఒక చపాతీ ని కజ్జికాయ చెక్క మీద పెట్టుకొని దానికి సరిపడా రవ్వ మిశ్రమాన్ని వేసుకొని అచ్చులుని బిగించి గట్టిగ ప్రెస్ చేసి అధికముగా ఉన్న పిండి ని చేతితో తీసేయాలి. నింపుకొని కజ్జికాయలని ఒక ప్లేటులోకి తీసుకోండి .
  7. ఇలాగే మిగిలిన కజ్జికాయలను అన్నిటినీ కూడా తయారు చేసుకోండి .
  8. ఒక పెద్ద బాండీ తీసుకొని వేయించటానికి సరిపడా నూనె పోసుకొని బాగా వేడి చేసుకోవాలి . నూనె వేడి అయ్యాక తయారు చేసుకున్న కజ్జికాయలు మెల్లగా నూనె లో వేసుకొని గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  9. అంతే ఎంతో రుచికరమైన రవ్వ కజ్జికాయలు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర