హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of ARISELU by T harika at BetterButter
1047
2
0.0(0)
0

అరిసెలు

Nov-03-2018
T harika
720 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

ఆంధ్రా పండగ స్పెషల్ అరిసెలు. బియ్యం మరియు బెల్లం మాత్రమే వాడి చేసే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం (స్వర్ణ) 1 కిలో
  2. బెల్లం 1/2 కిలో
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  4. గసగసాలు లేదా నువ్వులు 1/2 కప్

సూచనలు

  1. బియ్యం శుభ్రంగా కడిగి 12 గంటలు నాన బెట్టుకోవాలి
  2. నానిన బియ్యాన్ని ఒక పొడి బట్టపై వేసి కొంచం ఆరనివ్వాలి
  3. తడి పొడిగా ఉండగానే మెత్తని పిండిగా మరపట్టించుకోవాలి
  4. పిండిని జల్లడపట్టి గట్టిగా ఒక పక్కకి నొక్కి పెట్టుకోవాలి
  5. ఇలా చేయడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది
  6. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం కొంచం నీళ్లు తీసుకొని పాకం పట్టుకోవాలి
  7. పాకం కొంచం నీళ్లలో వేస్తే ఉండలా అవ్వాలి
  8. ఉండపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచం కొంచం పిండి వేసుకొంటు కలుపు కోవాలి
  9. మరీ గట్టిగా అయ్యేవరకు పిండి వెయ్యద్దు
  10. కొంచం జారుడుగానే ఉండాలి చల్లారాక గట్టిపడుతుంది
  11. తయారైన ఈ చలిమిడి గోరువెచ్చగా ఉండగా నిమ్మకాయంత సైజ్ ముద్దాలుగా చేసుకొని గసగసాలు లో దొర్లించు కోవాలి
  12. వీటిని ప్లాస్టిక్ కవర్ పై వేసి కొంచం మందంగా వత్తుకోవాలి
  13. వీటిని నూనె లో వేసి ఎర్రగా వేయించాలి
  14. నూనె ని గట్టిగా వత్తి పిండాలి
  15. అంతే అరిసెలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర