హోమ్ / వంటకాలు / బొబ్బట్లు

Photo of Bobbatlu by Pravallika Srinivas at BetterButter
1581
4
0.0(0)
0

బొబ్బట్లు

Nov-03-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బట్లు రెసిపీ గురించి

బొబ్బట్లు సంప్రదాయం వంట చిన్నపిల్లలు బోర్లా పడినపుడు బొబ్బట్లు తప్పకుండ చేస్తారు.వీటినే పోలీలు అని ఓళిగలు పురన్ పోలీలు అని వివిధ పేర్లు .పేర్లు ఎన్ని అయినా రుచి మాత్రం అద్భుతం . ఈ బొబ్బట్లు నేతితో చేస్కుని నేతిలో నంచుకుని తింటుంటే చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ప్రెజర్ కుక్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా - 250 గ్రాములు
  2. ఉప్పు - 1/4 స్పూను
  3. పచ్చిపప్పు - 1 టీ గ్లాస్
  4. బెల్లం - 125 గ్రాములు
  5. యాలుకల పొడి - 1/4 స్పూను
  6. నెయ్యి - తగినంత
  7. నీరు - తగినంత
  8. నూనె - తగినంత

సూచనలు

  1. ఒక బేసన్ మైదా ,ఉప్పు, నూనె వేసి కలిపి పైనుండి నీరువేసి చపాతీపిండి కన్నా మరికొంచం జారుగా కలుపుకోవాలి.
  2. పైన మరి కొంచం నూనె వేసి ఒక అరగంట నాననివ్వాలి.ఈలోగా పచ్చిపప్పు కడిగి తగినన్ని నీరుపోసి కుక్కర్ లో మెత్తగా ఉడికించుకోవాలి.
  3. ప్రెషర్ పోయాక నీరు వడగట్టి మెత్తగా మెదుపుకోవాలి.
  4. ఒక కడాయిలో దంచిన బెల్లం వేసి కరగనిచ్చి మెదిపిన పప్పు, కొబ్బరి పొడి వేసి ఉడికించుకోవాలి.
  5. కాలాయి విడిచి కలిపేటపుడు ముద్దలాగా దగ్గరకు వస్తే పూర్ణాల పాకం సిద్ధం అయినట్టు.
  6. ఇప్పుడు దీనిని కొంచం చల్లారనివ్వాలి. ముందుగా తయారు చేసిన మైదాపిండి ముద్దను తీసుకుని ఒక సారి బాగా కలుపుకోవాలి.
  7. అరటిఆకు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీస్కుని పిండిని నేతి సహాయం తో రౌండ్గా వత్తుకోవాలి.
  8. మధ్యలో పూర్ణం పిండిని పెట్టి చివర్లు మడుచుకుంటూ ఉండేలాగా చేసుకోవాలి.
  9. మరి కొంచం నెయ్యి రాసుకుని మరల జాగ్రత్తగా పూర్ణం పిండి బయటకి రాకుండా రౌండ్గా వత్తుకోవాలి.
  10. ఇలా అన్ని సిద్ధం చేస్కుని పెనం పెట్టి వేడయ్యాక సన్నని మంటపైన నేతితో రెండువైపులా కాల్చుకోవాలి.
  11. అంతే వేడి వేడి బొబ్బట్లు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర