హోమ్ / వంటకాలు / బూందీ లడ్డూలు

Photo of Boondhi laddoo by Pravallika Srinivas at BetterButter
588
3
0.0(0)
0

బూందీ లడ్డూలు

Nov-04-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూందీ లడ్డూలు రెసిపీ గురించి

ఏ శుభకార్యమైన ముందు జ్ఞాపకం వచ్చేది లడ్డూలు .అందులో బూందీ లడ్డూలది ప్రత్యేక స్థానం. కొంచం శ్రమపడిన తర్వాత అందరు చక్కగా తినేస్తారు. అంత రుచికరమైన బూందీ లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దామా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. శనగపిండి - 500 గ్రాములు
  2. సోడా ఉప్పు - చిటికెడు
  3. మిఠాయిరంగు - చిటికెడు
  4. ఉప్పు - చిటికెడుl
  5. నెయ్యి - తగినంత
  6. జీడిపప్పు - 50 గ్రాములు
  7. కిస్మిస్ - 50 గ్రాములు
  8. నూనె - తగినంత
  9. పంచదార - 500 గ్రాములు
  10. నీరు - తగినంత
  11. యాలుకలపొడి - 1 స్పూను

సూచనలు

  1. ముందుగా ఒక బేసన్ లో జల్లెడ పట్టిన శనగపిండి, సోడా ఉప్పు, చిటికెడు మిఠాయిరంగు, ఉప్పు వేసి కలుపుకోవాలి.
  2. పైనుండి నీరు పోస్తూ ఉండలు లేకుండా బజ్జి పిండికి కొంచం జారుగా కలుపుకోవాలి.
  3. నెయ్యి లేదా నూనె కడాయి లో వేసి కాగా నివ్వాలి .
  4. ఇప్పుడు కలిపినా శనగ పిండిని ఒక చుక్క వేస్తే గుండ్రంగా తేలుతూ పైకి వస్తే లడ్డుల పిండి సరిగా ఉన్నట్టు.
  5. ఆలా కాకుండా పిండి రండాలనుండి దిగలేదు అంటే గట్టిగా కలిపినట్టు జాగ్రత్తగా చూసి మరి కొంచం నీరు పోసి బాగా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు ఒక చేతితో బూందీ గరిట పట్టుకుని గుంతగరిటతో కలిపిన శనగపిండి వేసుకోవాలి.
  7. గరిట హేండిల్ ని పైకి కిందికి అనడం వలన బూందీ నూనె లో పడిపోతుంటాయి.
  8. సన్నని మంటపైన లేతగా వేయించుకుని చిల్లుల గిన్నిలో తీసుకోవాలి.
  9. ఇలాగె పిండి మొత్తం అయ్యేవరకు చేసి పెట్టుకోవాలి.
  10. కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు ,కిస్మిస్ వేయించి పెట్టుకోవాలి.
  11. ఇప్పుడు మరొక వెడల్పు గిన్నిలో పంచదార ,నీరు ,యాలుకలపొడి వేసి తీగ పాకం తీసుకోవాలి.
  12. ఇప్పుడు తయారైన బూందీని వేయించిన జీడిపప్పు ,కిస్మిస్ పళ్ళు వేసి కలుపుకోవాలి.
  13. కొంచం చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి.
  14. అంతే రుచికరమైన బూందీ లడ్డూలు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర