కార బూందీ | Kaara boondi Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  4th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Kaara boondi by Pravallika Srinivas at BetterButter
కార బూందీby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

కార బూందీ వంటకం

కార బూందీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaara boondi Recipe in Telugu )

  • శనగపిండి - 1/2 కేజీ
  • బియ్యం పిండి - 100 గ్రాములు
  • సోడా ఉప్పు - చిటికెడు
  • ఉప్పు - 1 స్పూను
  • నూనె - తగినంత
  • పల్లీలు - 100 గ్రాములు
  • కర్వేపాకు - 4 రెమ్మలు
  • వెల్లులికారం - 1 స్పూను

కార బూందీ | How to make Kaara boondi Recipe in Telugu

  1. ముందుగా ఒక బేసన్ లో జల్లెడ పట్టిన శనగపిండి ,బియ్యం పిండి ,సోడా ఉప్పు , ఉప్పు వేసి కలుపుకోవాలి.
  2. పైనుండి నీరు పోస్తూ ఉండలు లేకుండా బజ్జి పిండికి కొంచం జారుగా కలుపుకోవాలి.
  3. నూనె కడాయి లో వేసి కాగా నివ్వాలి .
  4. ఇప్పుడు కలిపినా శనగపిండిిని ఒక చుక్క వేస్తే గుండ్రంగా తేలుతూ పైకి వస్తే పిండి సరిగా ఉన్నట్టు.
  5. ఆలా కాకుండా పిండి రంధ్రాలనుండి దిగలేదు అంటే గట్టిగా కలిపినట్టు జాగ్రత్తగా చూసి మరి కొంచం నీరు పోసి బాగా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు ఒక చేతితో బూందీ గరిట పట్టుకుని గుంతగరిటతో కలిపినా శనగపిండి వేసుకోవాలి.
  7. గరిట హేండిల్ ని పైకి కిందికి అనడం వలన బూందీ నూనె లో పడిపోతుంటాయి.
  8. సన్నని మంటపైన దోరగా వేయించుకుని చిల్లుల గిన్నిలో తీసుకోవాలి.
  9. ఇలాగె పిండి మొత్తం అయ్యేవరకు చేసి పెట్టుకోవాలి.
  10. ఇప్పుడు అదే నూనె లో పల్లీలు వేయించుకోవాలి.
  11. కర్వేపాకు కూడా వేయించుకోవాలి.
  12. వేయించిన పల్లీలు ,కర్వేపాకు, ఉప్పు, వెల్లులికారం అన్ని బూందిలో వేసి కలుపుకోవాలి.
  13. అంతే రుచికరమైన కార బూందీ రెడీ

నా చిట్కా:

బియ్యంపిండి వేయడం వలన కారకరలాడతాయి .చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి.

Reviews for Kaara boondi Recipe in Telugu (0)