హోమ్ / వంటకాలు / కార బూందీ

Photo of Kaara boondi by Pravallika Srinivas at BetterButter
561
2
0.0(0)
0

కార బూందీ

Nov-04-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార బూందీ రెసిపీ గురించి

కార బూందీ టీ టైం లో మంచి స్నాక్ ఐటెం అంతే కాదు అన్నం లో కూడా కలిపి తింటే బాగుంటుంది .చాట్ ఐటమ్స్ పెరుగు వడ పెరుగు వడ ఎలా వీటిలో అయినా తినేయవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. శనగపిండి - 1/2 కేజీ
  2. బియ్యం పిండి - 100 గ్రాములు
  3. సోడా ఉప్పు - చిటికెడు
  4. ఉప్పు - 1 స్పూను
  5. నూనె - తగినంత
  6. పల్లీలు - 100 గ్రాములు
  7. కర్వేపాకు - 4 రెమ్మలు
  8. వెల్లులికారం - 1 స్పూను

సూచనలు

  1. ముందుగా ఒక బేసన్ లో జల్లెడ పట్టిన శనగపిండి ,బియ్యం పిండి ,సోడా ఉప్పు , ఉప్పు వేసి కలుపుకోవాలి.
  2. పైనుండి నీరు పోస్తూ ఉండలు లేకుండా బజ్జి పిండికి కొంచం జారుగా కలుపుకోవాలి.
  3. నూనె కడాయి లో వేసి కాగా నివ్వాలి .
  4. ఇప్పుడు కలిపినా శనగపిండిిని ఒక చుక్క వేస్తే గుండ్రంగా తేలుతూ పైకి వస్తే పిండి సరిగా ఉన్నట్టు.
  5. ఆలా కాకుండా పిండి రంధ్రాలనుండి దిగలేదు అంటే గట్టిగా కలిపినట్టు జాగ్రత్తగా చూసి మరి కొంచం నీరు పోసి బాగా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు ఒక చేతితో బూందీ గరిట పట్టుకుని గుంతగరిటతో కలిపినా శనగపిండి వేసుకోవాలి.
  7. గరిట హేండిల్ ని పైకి కిందికి అనడం వలన బూందీ నూనె లో పడిపోతుంటాయి.
  8. సన్నని మంటపైన దోరగా వేయించుకుని చిల్లుల గిన్నిలో తీసుకోవాలి.
  9. ఇలాగె పిండి మొత్తం అయ్యేవరకు చేసి పెట్టుకోవాలి.
  10. ఇప్పుడు అదే నూనె లో పల్లీలు వేయించుకోవాలి.
  11. కర్వేపాకు కూడా వేయించుకోవాలి.
  12. వేయించిన పల్లీలు ,కర్వేపాకు, ఉప్పు, వెల్లులికారం అన్ని బూందిలో వేసి కలుపుకోవాలి.
  13. అంతే రుచికరమైన కార బూందీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర