కోవా కజ్జికాయలు | Kova kajjikayalu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  7th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kova kajjikayalu recipe in Telugu,కోవా కజ్జికాయలు, Sree Vaishnavi
కోవా కజ్జికాయలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

కోవా కజ్జికాయలు వంటకం

కోవా కజ్జికాయలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kova kajjikayalu Recipe in Telugu )

  • మైదాపిండి: 4 కప్పులు
  • నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు
  • కోవా: రెండున్నరకప్పులు
  • కొబ్బరితురుము: కప్పు
  • యాలకులపొడి: టీస్పూను
  • బాదంముక్కలు: 4 టేబుల్‌స్పూన్లు
  • జీడిపప్పుముక్కలు: 4 టేబుల్‌స్పూన్లు
  • ఎండుద్రాక్ష: 4 టేబుల్‌స్పూన్లు
  • పంచదార: ఒకటింపావు కప్పు

కోవా కజ్జికాయలు | How to make Kova kajjikayalu Recipe in Telugu

  1. మైదాలో నెయ్యి వేసి కలపాలి.
  2. తరవాత అవసరమైతే మరికాస్త నెయ్యి లేదా నూనె వేసి కలపాలి.
  3. తరవాత కొంచెంకొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని మృదువుగా కలిపి తడిబట్ట వేసి కప్పి ఉంచాలి. 
  4. గిన్నెలో కోవా వేసి మెత్తగా చిదమాలి. 
  5. చిన్న పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కోవా వేసి అది గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. 
  6. పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. బాదం, జీడిపప్పు ముక్కలు, కొబ్బరితురుము, ఎండుద్రాక్ష వేసి రెండు నిమిషాలు వేయించి దించి చల్లారనివ్వాలి. 
  7. పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని చిన్న పూరీల్లా వత్తాలి. 
  8. ఒక్కోదాంట్లో కాస్త కోవా మిశ్రమాన్నివేసి కజ్జికాయల మాదిరిగానే వేళ్లతో కాస్త మెలిపెట్టినట్లుగా అంచుల్ని నొక్కాలి.
  9. ఇలాగే అన్నీ చేసుకుని నెయ్యి లేదా నూనెలో వేయించి తీసి సర్వ్ చేయడమే

Reviews for Kova kajjikayalu Recipe in Telugu (0)