హోమ్ / వంటకాలు / చింతపండు పులిహోర

Photo of TAMARIND RICE by Raji T at BetterButter
669
1
0.0(0)
0

చింతపండు పులిహోర

Nov-08-2018
Raji T
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతపండు పులిహోర రెసిపీ గురించి

ప్రతి పండక్కి సాధారణంగా చేసుకొనే ఈ పులిహోర రుచి మాత్రం ఆమోఘంగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1 కప్
  2. చింతపండు 2 నిమ్మకాయలంత
  3. ఉప్పు తగినంత
  4. పల్లి ఆయిల్ 1/4 కప్
  5. ఆవాలు 1 స్పూన్
  6. చనగపప్పు 1 స్పూన్
  7. మినప్పప్పు 1 స్పూన్
  8. జీలకర్ర 1 స్పూన్
  9. పల్లిలు 2 స్పూన్స్
  10. పసుపు 1/2 స్పూన్
  11. ఇంగువ 1/2 స్పూన్
  12. కరివేపాకు 2 రెమ్మలు
  13. పచ్చిమిర్చి 4
  14. ఎండుమిర్చి 3
  15. అల్లం అంగుళం ముక్క
  16. ఉప్పు తగినంత
  17. బెల్లం 2 స్పూన్స్

సూచనలు

  1. బియ్యం కడిగి 3 కప్స్ వాటర్ పోసుకొని అన్నం వండుకోవాలి
  2. చింతపండు నీళ్లు పోసి నాన బెట్టుకోవాలి
  3. నానిన తర్వాత చిక్కని గుజ్జుగా తయారు చేసుకోవాలి
  4. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి
  5. ఆయిల్ వేడెక్కకా పల్లిలు వేసి 1 మినిట్ వేయించాలి
  6. తర్వాత వరుసగా పోపు దినుసులు అన్ని వేసి వేయించాలి
  7. తర్వాత ఇంగువ కూడా వేయాలి
  8. పోపు వేగాక అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి
  9. ఇప్పుడు పసుపు చింతపండు గుజ్జు బెల్లం ఉప్పు వేసుకొని బాగా ఉడికించాలి
  10. ఆయిల్ తేలి పులుసు దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  11. వండిన అన్నాన్ని పెద్ద ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చాలి
  12. తయారు చేసుకొన్న పులుసు వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర