జిలేబి | jalebi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  8th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • jalebi  recipe in Telugu,జిలేబి, Sree Vaishnavi
జిలేబిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

7

0

జిలేబి వంటకం

జిలేబి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make jalebi Recipe in Telugu )

  • మైదా - 1 కప్పు
  • శనగ పిండి - 1 టేబుల్ స్పూన్
  • పెరుగు - 1 కప్పు
  • చక్కెర - 1 కప్పు
  • నీరు - 4 కప్పులు
  • కుంకుమ పువ్వు - 4-5 రేకలు
  • సాల్ట్ - చిటికెడు
  • నూనె వేయించడానికి సరిపడా

జిలేబి | How to make jalebi Recipe in Telugu

  1. బౌల్ లోకి మైదా పిండి తీసుకోవాలి.
  2. దానికి శనగపిండి మరియు తాజా పెరుగు కలపాలి.
  3. ఉండలు లేకుండా మందపాటి పేస్ట్ గా కలపాలి.
  4. కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.
  5. ఈ లోపు పొయ్యి మీద పాన్ పెట్టి పంచదార వేయాలి.
  6. పంచదారలో నీరు పోయాలి.
  7. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి.
  8. కుంకుమ పువ్వు మరియు ఫుడ్ కలర్ కలపాలి.
  9. తక్కువ మంట మీద బాగా కలపాలి.
  10. ప్లాస్టిక్ స్క్వీజ్ బాటిల్ తీసుకోండి.
  11. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి.
  12. బాటిల్ లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్ కి నాజిల్ ఉన్న మూతను పెట్టాలి.
  13. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  14. ఆ నోజ్ల్ ద్వారా జిలేబి వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు ఉంచాలి
  15. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి.
  16. వేడి వేడి జిలేబీలకు సర్వ్ చేయండి

నా చిట్కా:

పెరుగు పుల్లగా లేకుండా తాజాగా ఉండాలి.

Reviews for jalebi Recipe in Telugu (0)