హోమ్ / వంటకాలు / బూరెలు.

Photo of Boorelu (Stuffed sweet balls) by దూసి గీత at BetterButter
523
2
0.0(0)
0

బూరెలు.

Nov-08-2018
దూసి గీత
60 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూరెలు. రెసిపీ గురించి

రుచీ,ఆరోగ్యాల మిళితం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. శనగపప్పు : 1 కప్పు.
  2. పెసరపప్పు : 1 కప్పు.
  3. పంచదార , : 2 కప్పులు.( తీపి ఎక్కువ కావాలంటే 1/2 కప్పు ఎక్కువ వేసుకోవచ్చు)
  4. పచ్చి కొబ్బరి తురుము : 1 కప్పు.
  5. యాలకుల పొడి : 1/4 చెంచా‌
  6. నూనె : వేయించడానికి సరిపడినంత.
  7. మినప్పప్పు : 1 కప్పు.
  8. బియ్యం : 2 కప్పులు.
  9. ఉప్పు : చిటికెడు.
  10. బెల్లం 1/2 చెంచాడు.

సూచనలు

  1. బూరెలు చెయ్యడానికి ముందురోజు రాత్రి శనగపప్పు, పెసరపప్పు కలిపి నానపెట్టాలి.
  2. మినప్పప్పు, బియ్యం కూడా కలిపి నానపెట్టాలి.
  3. ఉదయం శనగపప్పు, పెసరపప్పు కాస్త బరకగా రుబ్బాలి.
  4. మినప్పప్పు, బియ్యం దోశెలపిండిలా రుబ్బుకోవాలి.
  5. దోశెల పిండిలో అవసరమైనంత తీసుకుని, అందులో చిటికెడు ఉప్పు, బెల్లం కలిపి కొద్దిగా నీళ్ళు కూడా కలిపి కాస్త పల్చగా చేసితోపు పిండి రెడీ గా ఉంచుకోవాలి.
  6. రుబ్బిన శనగపప్పు మిశ్రమం ఇడ్లీలు పెట్టుకుని, చల్లారేక ముక్కలు చేసి, మిక్సీ లో ఒకసారి తిప్పి తీసెస్తే పొడి పొడిగా విడిగా పువ్వులా అవుతుంది ‌
  7. దళసరి గిన్నె / మూకుడు లో కొబ్బరి వేసి 2 నిమిషాలు వేయించి, అందులోనే పంచదార కూడా వేసి పాకం వచ్చి కొబ్బరి లౌజులా అయ్యేక రెడీగా ఉన్న పూర్ణం వెయ్యాలి.అన్నీ కలిపి 5 నిమిషాలు స్టౌ మీద ఉంచి బాగా కలుపుతూ ఉండాలి. చివరిగా ఏలకులు పొడి కలిపి దించేయాలి.
  8. పూర్ణం మిశ్రమం చల్లారేక నిమ్మకాయంత ఉండలు చేసుకుని, తోపు పిండి లో ఒక్కో ఉండనీ ముంచి వేడి నూనెలో లో వేయించుకోవాలి..
  9. ఎంతో రుచిగా ఉండే పోలి పూర్ణం బూరెలు తయారు. ఇడ్లీలా పెట్టడాన్ని పోలి అంటారు మినప్పప్పు రొట్టిని పోలి రొట్టి అని కూడా అంటారు అందుకే వీటిని పోలి పూర్ణం బూరెలు అంటాము.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర