హోమ్ / వంటకాలు / ఆరెంజ్ జిలేబి

Photo of Orange jalebi  by Kavitha Perumareddy at BetterButter
855
4
0.0(0)
0

ఆరెంజ్ జిలేబి

Nov-08-2018
Kavitha Perumareddy
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరెంజ్ జిలేబి రెసిపీ గురించి

ఈ జిలేబి పాకంలో ఆరెంజ్ జ్యూస్ వేసి చేసాను .చాలా టేస్టీగా ఉన్నాయి జిలేబీలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఉత్తర భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా పిండి ఒక కప్
  2. ఆరెంజ్ జ్యూస్ పావుకప్
  3. చెక్కర ఒకటిన్నర కప్
  4. యాలకులపొడి స్పున్
  5. కుంకుమపువ్వు చిటికెడు
  6. వంటసోడా చిటికెడు
  7. గట్టి పెరుగు పావు కప్
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. ఆరెంజ్ ఫుడ్ కలర్ చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి,పెరుగు,వంటసోడా, తగినన్ని నీళ్లుపోసి దోసెపిండిలా కలుపుకోవాలి .
  2. తరువాత పోయిమీద గిన్నెపెట్టి చెక్కర ,సగం కప్ నీళ్లు పోసి లేతపాకం రానివ్వాలి గులాబీజామ్ పాకంలా ఉండాలి.తరువాత పాకంలో ఆరెంజ్ జ్యూస్,యాలకుల పొడి,కుంకుమపువ్వు, పుడ్ కలర్ వేసి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  3. తరువాత నానబెట్టిన పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత పిండిని సాస్ బాటిల్ లో వేసుకోవాలి.కింద పిక్ లో చూపించిన బాటిల్ లో వేసుకుంటే జిలేబి వేసుకోవడం ఈజీగా ఉంటుంది.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి తగినంత నూనె వేసి కాగినతారువత పిండిని గుండ్రంగా తిప్పుతూ చక్రాలు లా వేసుకోవాలి.గోల్డ్ కలర్ వచ్చేవరకు వేపుకొని తీసి వెంటనే పాకంలో వేసి స్పూన్ తో ఒత్తుకోవాలి. అప్పుడు జిలేజీ పాకం బాగా పీల్చుకుంటుంది.తరువాత తీసి వేరే ప్లేట్ లో వేసుకోవాలి .ఇలా అన్ని జిలేబీలు చేసుకోవాలి.
  5. అంతే వేడి వేడి జిలేబి రెడీ. తరువాత ఒక ప్లేట్ లో చక్కగా అలంకరించి అందరికి అందివ్వాలి ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర