హోమ్ / వంటకాలు / నేతి మైసూర్ పాక్

Photo of GHEE Mysore pak  by Kavitha Perumareddy at BetterButter
639
3
0.0(0)
0

నేతి మైసూర్ పాక్

Nov-08-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నేతి మైసూర్ పాక్ రెసిపీ గురించి

మైసూర్ పాక్ ఇలా చేసుకుంటే చాలా స్మూత్ గా నోటిలో వేసుకుంటే కరిగి పోయేలా ఉంటుంది.పాలు వేసుకోవడం వల్ల రుచిగా ఉంటుంది.పిల్లలకు బాగా నచుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపిండి ఒక కప్
  2. చెక్కర ఒకటిన్నర కప్స్
  3. పాలు సగం కప్
  4. నెయ్యి ఒక కప్
  5. నూనె సగం కప్

సూచనలు

  1. ముందుగా పోయిమీద మందంగా వుండే బాండీ పెట్టి చెక్కర సగం కప్ పాలు పోసి పాకం రానివ్వాలి .
  2. ఒక గిన్నెలో కొద్దిగా నీరు తీసుకొని పాకం వేసి చూసుకోవాలి. పాకం కింద చూపిన విధంగా ఉండాలి.మరీ ముదురుపాకం రాకూడదు.
  3. ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టి పాకంలో సేనాగపిండి కొద్దీ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  4. బాగా కలుపుతూ ఉండాలి పిండి కొద్దిగా ఉడికిన తరువాత నెయ్యి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి.
  5. నూనెకుడా వేసి కలుపుతూ ఉడకనివ్వాలి. కలుపుతూనే ఉండాలి పిండిని .అప్పుడే మాడిపోకుండా బాగా ఉంటుంది.పిండి ఇలా బాగా దగ్గరపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  6. తరువాత నెయ్యి రాసిన గిన్నెలో వేసుకోవాలి .వేసుకొని బాగా అంతా సర్దుతూ స్పున్ తో ఒత్తుకోవాలి.చల్లారిన తరువాత ముక్కలు కట్ చేసుకోవాలి .కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ముక్కలు చేసుకుంటే బాగా వస్తుంది.
  7. తరువాత ఒక ప్లేట్లో జాగ్రతగా బోర్లించుకొని గిన్నెపైన కొద్దిగా తట్టితే మైసూర్ పాక్ ప్లేట్ లో పడుతుంది .తరువాత ముక్కలుగా విడదీసుకొవాలి.
  8. అంతే ఎంతో స్మూత్ గా వుండే నేతి మైసూర్ పాక్ రెడీ ...ఒక 10 రోజులు నిలువ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర