హోమ్ / వంటకాలు / DRY fruits cham cham

Photo of DRY fruits  cham cham by Kavitha Perumareddy at BetterButter
917
1
0.0(1)
0

DRY fruits cham cham

Nov-09-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఉత్తర భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. చిక్కటి పాలు ఒక లీటర్
  2. పంచదార ఒక కప్
  3. నిమ్మకాయ 1
  4. స్టఫింగ్ కొరకు కావాల్సిన పదార్దాలు
  5. జీడిపప్పు 10 పీసెస్
  6. ఎండు ద్రాక్ష 10
  7. బాదం పప్పు 10
  8. ఎండు ఖర్జురం 3
  9. పిస్తా పప్పు 10
  10. పాల పొడి 3 స్పూన్స్
  11. పాలు చిన్న కప్
  12. పంచదార పొడి 4 పెద్ద స్పూన్స్
  13. కుంకుమపువ్వు చిటికెడు
  14. నెయ్యి 2 స్పూన్స్
  15. కొబ్బరి పొడి 5 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పాలను ఒక గిన్నెలో పోసి పోయిమీద పెట్టి మరగనివ్వాలి.మరుగుతున్నప్పుడు నిమ్మరసం వేసుకోవాలి .స్పున్ తో కలపాలి.అప్ప్పుడు అవి ఇరిగిపోతాయి.ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  2. తరువాత ఒక పలుచని క్లాత్ లో వడకట్టాలి.మళ్ళీ చల్లనీళ్లు పోసి వడకట్టి గట్టిగా పిండాలి. నీరంతా పోనివ్వాలి.
  3. తరువాత గిన్నెలో తీసుకొని 10 నిముషాలు చేతితో బాగా మర్దనా చేసుకోవాలి.అప్పుడు స్మూత్ గా అవుతుంది.
  4. తరువాత నచ్చిన షేప్ లో చమ్ చమ్ లు చేసుకోవాలి.వీటికి పగుళ్లు ఉండకుండా నున్నగా ఉండేలా చేసుకోవాలి. లేకపోతే విడిపోతుంది.
  5. ఇప్పుడు పోయిమీద గిన్నె పెట్టి కప్ పంచదార వేసి రెండు కప్పులు నీళ్లు పోసి మరిగించి రెడీ చేసుకున్న వాటిని వేయాలి.పాకం రావాల్సిన పనిలేదు .
  6. మూత పెట్టి పెద్ద మంట మీద 10 నిముషాలు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు చమ్ చమ్ లు డబుల్ సైజ్ అవుతాయి .
  7. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మీక్షిలో వేసి పొడి చేసుకోవాలి.తరువాత పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కాగినతారువత డ్రై ఫ్రూట్స్ పొడి వేసి కలపాలి.తరువాత పాలు వేసి కలపాలి.తరువాత పాలపొడి వేసి కలపాలి.తరువాత పంచదార పొడి,పాలల్లో నానబెట్టుకున్న కుంకుమపువ్వు వేసి అంతా బాగా కలుపుకోవాలి.దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్టఫింగ్ కు డ్రై ఫ్రూట్ మిశ్రమం రెడీ ఇక.
  8. ఇప్పుడు చమ్ చమ్ లను పాకంలో నుండి బయటకు తీసుకొని కత్తితో నిలువుగా కట్ చేసుకోవాలి.కొద్దిగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు వాటిల్లో స్టఫింగ్ కూర్చుకోవాలి.ఇలా
  9. తర్వాత కొబ్బరి పొడిలో దొర్లించుకోవాలి.స్టఫింగ్ పైన డ్రై ఫ్రూట్స్ ముక్కలతో అలంకరించుకోవాలి.ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Gadige Maheswari
Dec-04-2018
Gadige Maheswari   Dec-04-2018

Awesome...

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర