హోమ్ / వంటకాలు / మురి మిక్స్

Photo of Puffed rice chivda by Reena Andavarapu at BetterButter
446
1
0.0(0)
0

మురి మిక్స్

Nov-09-2018
Reena Andavarapu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురి మిక్స్ రెసిపీ గురించి

ఏ పండుగకైనా ఈజీ గా ఈ మిక్సచేరు చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. మురుమురాలు మూడు కప్పులు
  2. ఉల్లిపాయలు రెండు
  3. వెల్లుల్లి రెక్కలు మూడు
  4. సాంబార్ పొడి/ కారం పొడి 1 పెద్ద స్పూన్
  5. పాసుపు ఒక చిన్న స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. వేరుశెనగ పప్పు 1/4 కప్పు
  8. దలియా/ చట్నీ పప్పు 2 పెద్ద స్పూన్
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. పచ్చి మిర్చి రెండు
  11. నెయ్యి 2 పెద్ద స్పూన్లు
  12. నూనె సరిపడా

సూచనలు

  1. ఉల్లిపాయ ఇంకా పచ్చి మిర్చి సన్నగా పొడుగ్గా కోసి ఉంచాలి
  2. ఉల్లిపాయ పచ్చి ఇర్చి నూనెలో క్రిస్పీ అయ్యేవరకు డీప్ ఫ్రై చెయ్యాలి
  3. టిష్యూ మీదకి తీసి ఉంచాలి
  4. ఒక పెద్ద కడాయి తీసుకొని రెండు స్పూన్ల నెయ్య వేసుకొని వేడి చెయ్యండి.
  5. ముందుగా వేరు శెనగ పలుకులు వేసుకొని వేయించుకోవాలి
  6. తరువాత పుట్నాలపప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి
  7. ఇప్పుడు వెల్లుల్లి రెక్కలు కొంచెము చితక కొట్టి క్రిస్ప్ అయ్యేవరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా ఫ్రై చెయ్యాలి
  8. పసుపు , సాంబార్ పొడి గాని కారం పొడి వేసి కొన్ని సెకండ్లు కలిపి మురుమురాలు వేసి,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  9. వేయించిన ఉల్లి ఇంకా పచ్చి మిర్చి వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చెయ్యాలి
  10. చల్లారాక గాలి చొరబడని డబ్బాలో వేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర