హోమ్ / వంటకాలు / సొజ్జప్పాలు

Photo of Sweet poories by lakshmi kumari at BetterButter
367
1
0.0(0)
0

సొజ్జప్పాలు

Nov-09-2018
lakshmi kumari
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొజ్జప్పాలు రెసిపీ గురించి

చాలా రుచికరంగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వాటితో పాటు తినేవి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్పుగోధుమ రవ్వ (బొంబాయి రవ్వ)
  2. 3/4 కప్పుపంచదార
  3. 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ పండ్లు
  4. 1/2 టీస్పూన్ ఆకుల పొడి
  5. 1 కప్పు మైదా పిండి
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  7. 3 టీ స్పూన్లు నెయ్యి
  8. 2 కప్పులు నీళ్లు

సూచనలు

  1. పొయ్యి మీద బాణలి పెట్టి నెయ్యి వేసి కిస్మిస్ వేయించాలి.
  2. బొంబాయి రవ్వ వేసి వేయించాలి.
  3. బొంబాయి రవ్వ వేసి కొంచెం వేగిన తర్వాత నీరు 2 కప్పులు నీళ్లు పోసి పంచదార కూడా వేయాలి.
  4. ఒకసారి కలిపి మూత పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి.
  5. హల్వా ని బాగా చల్లారనివ్వాలి.
  6. మైదా పిండిలో ఒక స్పూన్ బొంబాయి రవ్వ,1స్పూన్ నూనా వేసి వేళ్ళతో బాగా కలుపుకోవాలి.
  7. కొంచెం కొంచెం నీరు పోస్తూ పూరీ పిండి కన్నా కొంచెం పలుచగా కలుపుకోవాలి.
  8. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
  9. హలో నిమ్మకాయంత సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి .
  10. పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి.
  11. రొట్టెల పీట పైన కొంచెం నూనె రాసి, మైదా పిండి కొంచెం తీసుకుని చిన్న పూరీలా వత్తి,మధ్యలో హల్వా ఉండను పెట్టి మైదా తో కవర్ చేసి చేత్తోతట్టుకోవాలి.(పూరీ సైజ్ అంత).
  12. ఆయిల్ వేడెక్కేక, వత్తిన పూరీని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  13. మంటని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి.
  14. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టిష్యూ పేపర్ లో కి తీసుకోవాలి.
  15. మృదువుగా, చాలా టేస్టీ గాఉండే సొజ్జప్పాలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర