హోమ్ / వంటకాలు / గోధుమపిండి హల్వా.

Photo of Wheat flour halwa. by దూసి గీత at BetterButter
858
1
0.0(0)
1

గోధుమపిండి హల్వా.

Nov-09-2018
దూసి గీత
120 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి హల్వా. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపిండి - 1 కప్పు.
  2. పంచదార : 2 కప్పులు.
  3. నెయ్యి :. 1 కప్పు.
  4. యాలుకల పొడి : 1/4 చెంచా.
  5. జీడిపప్పు : 1/4 కప్పు.

సూచనలు

  1. గోధుమపిండి ని చపాతీ పిండిలా కలిపి ,అది మునిగేలా నీళ్ళు పోసి, మూత పెట్టి ,2 గంటల సేపు పక్కన ఉంచేయాలి.
  2. పూర్తిగా 2 గంటలయింది తర్వాత ఆ పిండిని చేత్తో నీళ్ళలో బాగా నలుపుతూ ఉంటే చిక్కని గోధుమ పాలు వస్తాయి. ఆపాలు వడపోసి,పిప్పి పడేయాలి.
  3. పంచదార లో 1/4 కప్పు పక్కన ఉంచి మిగతాది కొంచెం నీళ్ళు పోసి కరిగించాలి.
  4. పంచదార అంతా కరిగి పాకం వచ్చే సమయంలో గోధుమ పాలను కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి.
  5. ఈ లోగా పక్కన పెట్టిన 1/4 కప్పు పంచదార ను కేరమిల్ చేసి, అదికూడా గోధుమపాలు మిశ్రమంలో వేసి బాగా కలపాలి.దీనివలన హల్వా కి మంచి రంగు వస్తుంది.
  6. నెయ్యి కరిగించి,గోరువెచ్చగా ఉన్న నెయ్యి హల్వాలో కొంచెం,కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి.
  7. హల్వా పాత్ర అంచులు విడిచి ,నెయ్యి వదులుతూ, గ్లాసీ గా తయారైతే హల్వా రెడీ అయినట్టే. అప్పుడు జీడిపప్పు,యాలుకల పొడీ వేసి స్టౌ ఆపేసి,నెయ్యి రాసిన పళ్ళెంలో లోకి తీసెయ్యాలి.
  8. నోట్లో కరిగిపోయే గోధుమపిండి హల్వా రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర