హోమ్ / వంటకాలు / చింతపండు పులిహోర

Photo of Temple pulihoora by Anitha Rani at BetterButter
247
3
0.0(0)
0

చింతపండు పులిహోర

Nov-09-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతపండు పులిహోర రెసిపీ గురించి

ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది.అన్ని పండుగలకు,శుభకార్యాలకు చేసుకుంటాము.అమ్మవారి ప్రీతికరమైనది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యము150గ్రా
  2. చింతపండు50గ్రా
  3. ఎందుమిరపకాయలు 20
  4. నూనె 20గ్రా
  5. శనగపప్పు1/4కప్పు
  6. నువ్వులు1/4కప్పు
  7. మినపప్పు1/4కప్పు
  8. జీలకర్ర 1 స్పూన్
  9. ఇంగువ చిటికెడు
  10. ఉప్పు తగినంత
  11. ఆవాలు1చెంచా
  12. పల్లీలు 2 చెంచాలు
  13. జీడిపప్పు 2 చెంచాలు
  14. పచ్చిమిర్చి 6
  15. పసుపు 1టేబిల్ స్పూన్
  16. కరివేపాకు రెమ్మలు 10

సూచనలు

  1. బియ్యాన్ని బాగా కడిగి 1కి 2 నీరు పోసి కుక్కర్ లో కానీ విడిగా కానీ పలుకుగా అన్నము చేసుకోవాలి.
  2. అన్నము చల్లారనివ్వాలి.
  3. చింతపండు నానబెట్టి గుజ్జును చేసుకోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి అందులో శనగపప్పు, మినపప్పు,జీలకర్ర,మెంతులు,ఎండ్దుమిరపకాయలు,నువ్వులు ఒకదాని తరువాత ఒకటి వేగనివ్వాలి.
  5. చల్లారిన తరువాత ఉప్పు వేసి మిక్సీకి వేసి పెట్టుకోవాలి.
  6. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేడిఅయ్యాక అందులో ఆవాలు,శనగపప్పు,మినపప్పు,పచ్చి మిరపకాయలు,ఎందుమిరప కాయలు,ఒకదాని తరువాత ఒకటి వేగనివ్వాలి.
  7. పోపు వేగాక అందులో చింతపండు గుజ్జు,ఉప్పు,పసుపు,ఇంగువ ,కరివేపాకు వేసి దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి.
  8. ఉడికిన అన్నాన్ని ఒక వేడల్పాటి బేసిన్ తీసుకోవాలి.అందులో పొడి వేసి బాగా కలిపి,వేగిన చింతపండు గుజ్జులో ఉడికిన పోపు ను వేసి బాగా కలిపి మూత బెట్టాలి.
  9. చివరగా ఉప్పు చూసుకొని వేసుకోవాలి.
  10. కొద్ది సేపు మూత బెట్టి అలాగే ఉంచితే మంచి ఘుమ ఘుమ వాసన లతో పులిహోర తయారవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర