హోమ్ / వంటకాలు / తాలికల పాయసం

Photo of TAALIKALA PAAYASAM by Bharat Kumar at BetterButter
332
1
0.0(0)
0

తాలికల పాయసం

Nov-10-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తాలికల పాయసం రెసిపీ గురించి

బియ్యం పిండి పాలు తో చేస్తారు. సాధారణంగా కొన్ని పండగలకి చేసుకొంటారు. లక్ష్మీ దేవికి ఇష్టమైన వంటకం అంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1 లీటర్
  2. బెల్లం 1 కప్
  3. బియ్యం పిండి 1 కప్
  4. యాలకులు 4
  5. జీడిపప్పు 2 స్పూన్స్
  6. కొబ్బరితురుము 3 స్పూన్స్
  7. నెయ్యి 1 స్పూన్
  8. ఉప్పు చిటికెడు

సూచనలు

  1. ఒక కప్ వాటర్ బాగా మరిగించి ఉప్పు , బెల్లం ,బియ్యం పిండి వేసి బాగా కలిపి మూత పెట్టి దించుకోవాలి
  2. చల్లారాక మెత్తగా కలుపుకొని, చిన్న చిన్న ముద్దలు తీసుకొని, చేతికి తడి రాసుకొని పీటపై సన్నగా పొడవుగా తాలికలు చేసుకోవాలి
  3. సగం పిండి తాలికలు చేసుకోవాలి
  4. మిగిలిన పిండిలో వాటర్ పోసి గుజ్జులా కలుపుకోవాలి
  5. జీడిపప్పు కొంచం నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి
  6. ఒక మందపాటి గిన్నెలో పాలు పోసుకొని బాగా కాచుకోవాలి
  7. కాగిన పాలలో తాలికలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి
  8. తర్వాత తయారు చేసుకొన్న గుజ్జు , కొబ్బరికోరు వేసి 2 నిమిషాలు ఉడికించాలి
  9. బెల్లం, యాలుకల పొడి కూడా కలిపి బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  10. వేయించిన జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర