హోమ్ / వంటకాలు / బొంబాయి కరాచీ హల్వా

Photo of Bombay Karachi Halwa by Pravallika Srinivas at BetterButter
700
7
0.0(0)
0

బొంబాయి కరాచీ హల్వా

Nov-10-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి కరాచీ హల్వా రెసిపీ గురించి

ఈ స్వీట్ చేయడం సులేవే కానీ మనం చేయడం తక్కువ ఎక్కువ షాపులో కొనడమే .చాలా రుచికరమైన ఈ హల్వా ఇంట్లోనే షాప్ లో కన్నా చక్కని రుచితో చేస్కోవచ్చు. తయారీ విధానం చూసేదామా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఉత్తర భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కార్న్ ఫ్లోర్ - 1 కప్పు
  2. పంచదార - 1 కప్పు
  3. నెయ్యి - 1/4 కప్పు
  4. నీరు - 3 కప్పులు
  5. మిఠాయి రంగు - 1/4 చెంచా
  6. సార పలుకులు - పావు కప్పు
  7. జీడీపప్పు తరుగు - పావు కప్పు
  8. నిమ్మరసం - 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని కార్న్ ఫ్లోర్ వేసి ఒక కప్పు నీరు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు మరొక కప్పు నీరు వేసి జారుగా కలుపు కోవాలి.
  3. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సన్నని మంటపైన పంచదార మిగిలిన కప్పు నీరు వేసి కరిగిన తర్వాత మరుగుతున్నప్పుడు కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా తిప్పుకోవాలి.
  4. అలా తిప్పుతూ ఉన్నప్పుడు దగ్గర పడగానే నిమ్మరసం వేసి కలుపుకోవాలి. నిమ్మరసం వలన ట్రాస్పరెంటుగా అవుతుంది.
  5. ఇప్పుడు మిఠాయి రంగు వేసి బాగా కలిసేట్టుగా తిప్పుకోవాలి.
  6. ఇపుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకుని బాగా ఉడకనివ్వాలి.
  7. మిగిలిన నెయ్యి మొత్తం వేసి కలుపుకోవాలి.
  8. చివరిగా సార పలుకులు ,జీడిపప్పు తరుగు వేసి కలుపుకోవాలి.
  9. కొంచం సమయానికి కడాయి విడుస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రే లో వేసి సమానంగా పరుచుకోవాలి.
  10. ఒక పావు గంట చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.
  11. అంతే రుచికరమైన బాంబే కరాచీ హల్వా సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర